తితిదే లో మరల బ్రహ్మశ్రీ రమణ దీక్షితులు?

Chakravarthi Kalyan
రమణ దీక్షితులు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా చాలాకాలం పని చేశారు. ఆయన్ను పదవీ విరమణ చేయించి మరీ చంద్రబాబు సర్కారు బయటకు పంపింది. అర్చకులకు పదవీవిరమణ వయస్సుతో సంబంధం ఉండదని రమణ దీక్షితులు చేసిన వాదనలు చంద్రబాబు సర్కారు ముందు నిష్ఫలమయ్యాయి. 


ఈ అంశంపై రమణ దీక్షితులు న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. తనను మళ్లీ స్వామివారి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన వేడుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ సర్కారు కొలువుదీరనున్న నేపథ్యంలో తన గోడు విన్నవించుకునేందుకు రమణదీక్షితులు ప్రయత్నం చేస్తున్నారు. 

బుధవారం కాబోయే ముఖ్యమంత్రి జగన్ శ్రీవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో ఆయన తిరుమల చేరుకున్నారు. తిరుమలలో జగన్ ను రమణ దీక్షితులు కలిశారు. ఆయనతో మాట్లాడిన జగన్.. రేపు ఉదయం గుడిలో కలుద్దాము అని చెప్పారట. అయితే తనను నన్ను గుడిలోనికి రానివ్వటం లేదని చెప్పి రమణ దీక్షితులు వాపోయారట. 

దీనికి బదులిచ్చిన జగన్.. మీరు గుడికి రండి అన్ని నేను చూసుకొంటాను అని చెప్పి భరోసా ఇచ్చారట. జగన్ ఆ స్థాయిలో భరోసా ఇచ్చారంటే.. రమణ దీక్షితులు మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. రమణ దీక్షితులకు మళ్లీ కీలక అవకాశం ఇవ్వడం ద్వారా తితిదేలోనూ తన మార్కు ప్రక్షాళన ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: