హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నాడనగానే ఏదో జరిగిపోతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు, అధిష్టానంతో మాట్లాడారు, రాష్ట్రానికి చేరుకున్నారు, అయిన పెద్దగా జరిగిన మార్పులేవి లేవు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తాను బాధ పడకుండా, ఇతరులను బాధ పెట్టకుండా తప్పించుకుందామని అనుకున్నటువంటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి తప్పించుకోవడానికి వీలులేకుండా అధిష్టానం అగ్ని పరీక్ష పెట్టింది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టకొని సిఎం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సెలవిచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రి ధర్మాన ప్రసాదరావు తన పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలా లేదా అనే విషయానికి తెరపడనుంది. ఆలస్యంగా నైనా మంత్రి ధర్మాన ప్రసాద్ రావు రాజీనామాను సిఎం ఆమోదిస్తారనే విషయాన్ని మెజార్టీ ప్రజలు ఊహిస్తున్నారు.
నొప్పించక, తానొవ్వక, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నటువంటి సుమతి శతకాలు ఇప్పుడున్నటువంటి రాజకీయాలను చూస్తే గుర్తుకొస్తున్నాయి. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించకూడదని మెజార్టీ మంత్రులు డిమాండ్ చేశారు. ఇటువంటి సమయంలో సిఎం చేసేది లేక నిర్ణయం తీసుకోలేక, తీసుకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయోనని డిల్లీకి వెళ్లివచ్చారు. దీంతో అంతా మీఇష్టం అంటూ అధిష్టానం సెలవిచ్చింది. దీంతో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి దైర్యంగా ఉన్నారు. ఎవరేమీ అనుకున్న అధిష్టానం ఆశీస్సులు తమకు ఉన్నాయని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సిఎం గ్రహించి ఒక్కరొక్కరుగా కళంకిత మంత్రులను తొలగించిన ఆశ్చర్యపడనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆశీర్వాదాలు ఉన్నంత వరకు ఎవరెన్ని విమర్శలు చేసిన, బెదిరింపులకు పాల్పడిన చివరకు అధిష్టానం చెప్పిందే వేదం.
మరింత సమాచారం తెలుసుకోండి: