నలుగురు అధికారుల కోసం ఇంత దిగజారిపోవాలా బాబూ...ఆంధ్ర ప్రజ...!!
చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు. అందులో ఎవరికీ ఎటువంటి సందేహం. లేదు. పైగా ఆయనకు ఎన్నికలు కొత్త కాదు. అప్పట్లో అన్న నందమూరి అల్లుడిగా ఉంటూ తెర వెనక చక్రం తిప్పినా 1995 తరువాత టీడీపీ అధ్యక్షుని హోదాలో అనేక ఎన్నికలను డైరెక్ట్ గా నిర్వహించినా బాబుకు బాబే సాటి. ఓ విధంగా దేశంలో ఇంతలా ఎన్నికల నిర్వహణ, పోల్ మేనేజ్మెంట్ చేసే నాయకుడు మరొకరు లేరన్నది కూడా అతిశయోక్తి కాదు.
అటువంటి చంద్రబాబు ఈ రోజు వ్యవహరించిన తీరు పూర్తిగా ఆక్షేయపణీయం. ఆయన తన సీనియారిటీని, అనుభవాన్ని భావి తరాలకు వేరే విధంగా అందించాలి తప్ప ఈ విధంగా కాదన్నది మేధావుల మాటగా ఉంది. ఎన్నికల వేళ ఈసీ సర్వ స్వతంత్ర వ్యవస్థగా ఉంటుంది. పూర్తిగా నిష్పాక్షికంగా ఎన్నికలను జరిపించాలని చూస్తుంది. ఓ రిఫరీగా ఉంటుంది. ఆ టైంలో ప్రతిపక్షాలు ఎవరైన ఏదైనా అభ్యంతరాలు చెప్పినపుడు, ఈసీ వాటిని పరిశీలించి బాధ్యులైన అధికారులను పక్కన పెడుతుంది. ఇలా చేసినంత మాత్రాన ఆ అధికారులు దోషులని కాదు, వారిపైన చర్యలు కూడా ఉండవు.
అందరూ ఆమోదయోగ్యంగా ఉండే అధికారులను పెట్టి ఎన్నికలు జరిపించడమే ఈసీ బాధ్యతగా ఉంటుంది. ఆ విషయంలో ఈసీ చర్యలను తప్పు పట్టే హక్కు, అవకాశం దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు ఎందుకంతలా అధికారుల బదిలీ విషయంలో గంగవెర్రులెత్తుతున్నారన్నది అర్ధం కావడంలేదు. ఇంటెలెజెన్స్ చీఫ్ ని బదిలీ చేస్తే రచ్చ చేశారు కడప, శ్రీకాకుళం ఎస్పీలను పక్కన పెడితే గుండెలు బాదుకున్నారు. ఇపుడు ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రకాష్ ని బదిలీ చేస్తే బాబు గారు ఏకంగా ఈసీ ఆఫీస్ కే వచ్చి ద్వివేదీని బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ఆపై అక్కడే నిరసన కూడా చేపట్టారు.
నిజంగా బాబుకు ఇది తగదు కా క తగదు. ఇదే బాబు 2009 ఎన్నికల్లో అప్పటి డీజీపీ యాదవ్ ని బదిలీ చేయమని ఏకంగా డిల్లీ వెళ్ళి మరీ సీఈసీని కలసి వచ్చారు. ఆ మీదట యాదవ్ ని పక్కన పెట్టారు కూడా మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రిగా రాజ శేఖర రెడ్డి ఉన్నారు. ఆయన ఇలా శివాలెత్తలేదే. ఒక్క ఏపీలోనే కాదు, దేశంలో అనేక చోట్ల ఎన్నికల వేళ బదిలీలు అవుతూంటాయి. మరి ఎక్కడా లేని చిందులు బాబే ఎందుకు వేస్తున్నారు. అంటే తనకు బాగా నమ్మకమైన అ కారులను ముందు పెట్టి గెలవాలనుకుంటున్నారా అన్న అనుమానాలను ఆయనే కలుగచేశారు. ఇది నిజంగా విచారకరమే. దీని మీద అంధ్ర ప్రజ కచ్చితంగా ఆలొచిస్తుంది.