ఇందులో నిజమెంత? బాలకృష్ణ అల్లుళ్ళ మద్య కోల్డ్-వార్ నడుస్తుందా? శ్రీ భరత్ ఓటమికి లోకేష్ ఎత్తుగడ!

నందమూరి బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకెష్ స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు. రాష్ట్ర ఐటీ శాఖామాత్యులు. ఆయన గుఱించి జగమంతటికి తెలుసు. ఇక చిన్నల్లుడు శ్రీ భరత్ ముతుకుమిల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు దివంగత ఎంవివిఎన్ మూర్తి మనవడే కాదు ప్రముఖ పారిశ్రామిక వేత్త కావూరి సాంబశివరావు మనవడు కూడా. ఇద్దరూ స్టాన్-ఫోర్డ్ విద్యావేత్తలే. కాకపోతె నాలడ్జ్ వేరియన్స్ మాత్రమే. ఇద్దరూ దిగ్గజ రాజకీయ కుటుంబాల నేపధ్యం ఉన్నవారే. 


నిజానికి విశాఖ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు దేశం టికెట్ ను బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు ఇచ్చేందుకు నారా చంద్రబాబు నాయుడు మొదట్లో అంతగా ఉత్సాహం చూపలేదు. తనకు ఆ టికెట్ దక్కించుకోవడానికి శ్రీ భరత్ తీవ్రంగానే ప్రయత్నించాడు. ఆయన విశాఖ శాసనసభ్యులకు ప్రలోభాలు సైతం  ఏరవేసి ఎంపీ టికెట్ విషయం లో తన పేరును ప్రతిపాదించేలా చేసుకున్నారట. అయినా చంద్రబాబు మొదట అంత సానుకూలంగా స్పందించలేదన్న విషయం తెలిసిందే. 

ఎప్పుడైతే జనసేన తరఫు నుంచి అక్కడ "సీబీఐ మాజీ జేడీ వి వి లక్ష్మినారాయణ" పోటీ చేయడం ఖరారు అయ్యిందో, మామ నందమూరి బాలకృష్ణ తీవ్ర ప్రయత్నం వలననైతేనేమి, విశాఖ బరిలో టిడిపి గెలుపు అంత తేలికగా సాధ్యం కాదని గుర్తించిన చంద్రబాబు వ్యూహం ఫలితంగా శ్రీ భరత్ కు విశాఖ టిడిపి పార్లమెంట్ టికెట్ కంఫర్మ్ చేశారు. 

అసలు చంద్రబాబు నాయుడు సూచన మేరకే వివి లక్ష్మినారాయణ జనసేనలోకి చేరాడనే అభిప్రాయాలు జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. వివి లక్ష్మినారాయణకు సహకారం అందిస్తూ, విశాఖలో తన టిడిపి తరఫున డమ్మీగా చంద్రబాబు శ్రీ భరత్ ను నిలబెట్టాడని విశాఖ సమాచారం.  ఈ ప్రచారం జరుగుతున్న దరిమిలా నేపధ్య సమాచారం ఏమంటే ఇంటిగుట్టు.  కేవలం చంద్రబాబు మాత్రమే కాదు, తోడల్లుడు నారా లోకేష్ కూడా శ్రీ భరత్ అభ్యర్ధిత్వం మీద సానుకూలంగా లేరని, వీళ్ళ  మధ్య ముందు నుంచే విబేధాలున్నాయని ఈ నేపథ్యంలో శ్రీ భరత్ ఎంపీగా నెగ్గకూడదనేది నారా లోకేష్ ఎత్తుగడగా తెలుస్తోంది.

స్వతహాగా స్మార్ట్ చురుకైన శ్రీ భరత్ గీతం విద్యాసంస్థల పాలకమండలి నిర్వహణలో మెలుకువలు తెలిసినవ్యక్తి. అలాంటి  భరత్  ఎంపీగా గెలిస్తే తనను మించి పోతాడని లోకేష్ బాబు భయపడుతూన్నాడట. ఇప్పటికే లోకేష్ టాలెంట్ ఏమిటో "పప్పు" అని ముద్దుగా పిలుచుకునే తెలుగు జనాలకు తేటతెల్లంగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తన పార్టీలో తమ వాళ్లు ఎవరైనా ఎదిగితే వాళ్లు తనను పూర్తిగా నలిపేస్తారనే భయం నారా లోకేష్ కు సహజంగానే ఉందన్నది జూనియర్ ఎన్టీఆర్ ను అణగ ద్రొక్కటం రాజకీయాలకు దూరం పెట్టటం నుండే జన మెరిగిన సత్యం.  దీంతో, ఇప్పుడు శ్రీభరత్ ఓటమికి కూడా లోకేష్ అంతర్లీనం గా ప్రణాళికలు రచిస్తున్నారని విశాఖలో ఏక్కడపడితే నలుగురు కూడిన చోట ప్రధాన చర్చ అని టాక్!

సందులో సడేమియా అన్నట్లు - ఒక వేళ శ్రీ భరత్, జూనియర్ ఎన్టీఆర్ - రాజకీయాల్లో చేతులు కలిపితే నారా లోకేష్,  నారా బ్రాహ్మిణి మేడంహేరిటేజ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉందని జనంలో సెటైర్లు పేలుతున్నాయి.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: