జై జగన్...జై కేసీఆర్...

 హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను ప్రజలు పట్టించుకున్నట్లులేదు. తెలంగాణలో జనం కేసీఆర్ కు జై కొట్టగా...సీమాంధ్రలో జగన్ కు జై కొడుతున్నారు. ఓట్ల లెక్కింపు లో పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి జోరు కొనసాగిస్తుండగా, సీమాంధ్రలో ఫ్యాన్ హవా కొనసాగింది. 18అసెంబ్లీ స్థానాలకు గానూ పరకాలలో టీఆర్ఎస్ గెలుపు స్పష్టంగా కనిపిస్తోంది. 15అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంటులో వైఎస్ఆర్ పార్టీ లీడింగ్ లో ఉంది.  ఒకటి, రెండు స్థానాలలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను కొనసాగించేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ర్ట చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ నెల 12న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.  ఈ ఎన్నికలు కొత్తగా పురుడు పోసుకున్న వైఎస్ఆర్ పార్టీ జగన్ మనుగడకు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు అస్థితత్వానికి ముడిపడి వుండటంతో అందరూ ఎంతో ప్రతిష్టగా తీసుకుని ప్రచారం చేశాయి.  ముందుగానే జగన్ హవాను గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలోనే గత నెల 27 తన అక్రమ ఆస్తుల కేసులో విచారణకు పిలిచిన సీబీఐ అధికారులు అనూహ్యంగా అరెస్టు చేశారు.  ప్రచారంలో జగన్ ను పాల్గొనకుండా చేయడమే కోసం కాంగ్రెస్ అధిష్టానం ఒక పథకం ప్రకారం సీబీఐని పావుగా వాడుకుందనీ వైకాపా మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. జగన్ ను జైలుకు పంపడమే కాకుండా కాంగ్రెస్, టీడీపీ ఇద్దరూ జగన్ ను టార్గెట్గా చేసుకుని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  జగన్ కు ఓటేస్తే రాష్ర్టన్ని అమ్ముకుంటాండంటూ ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిరథమహారథులూ ప్రచారంలో పాల్గొన్నారు. అందరి నోట జగన్ మాటే. టీడీపీ గెలిచినా ఫర్వాలేదు కానీ, జగన్ వర్గీయులను గెలువనివ్వకూడదనే విధంగా ప్రచారం చేశారు. అయితే, అనూహ్యమైన పరిస్థితుల్లో విజయమ్మ, షర్మిల ప్రచార బాధ్యతలు చెప్పారు.  భర్తను పోగొట్టుకున్నా, కొడుకును జైలు పాల్జేశారు. మీరే న్యాయ నిర్ణేతలు, ధర్మ రక్షకులంటూ విజయమ్మ ఊరూరు తిరిగింది. తల్లికి తోడుగా షర్మిల బాగానే ప్రచారం చేసింది. వీరిద్దరి ప్రచారానికి ప్రజలు బాగా స్పందించారనీ తాజాగా వస్తున్న ఉప ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.  మొత్తానికి ఎవరెన్ని విధంగా జగన్ పై ఆరోపణలు చేసినా ప్రజలు వాటిని ఏమాత్రం నమ్మడం లేదని చెప్పడానికి ప్రజలు ఇస్తున్న తీర్పే ఇందుకు చక్కటి నిదర్శనం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: