ప్రణబ్ దాకి భారతరత్న- మోడీ బెంగాల్ ప్రజలపై వేసిన సమ్మోహనాస్త్రమా! ఝలక్ టు మమత

రాజకీయం ప్రజాసేవ అనే గుమ్మదాటి నాకేటి? ణా పార్టీకేటి? ఆనే దిశలో నడుస్తుంది. అందుకే విస్టృత స్థాయిలో ప్రజాధనం ఖర్చైపోగా అసలు లబ్ధిదారులకు దాని తాలూకు తేమైనా చేరట్లేదు. అలాగే దేశ గౌరవ ప్రతీకలైన భారతరత్న పద్మ పురస్కారాల విషయంలో కూడా ప్రజలకు రాజకీయాలే కనిపిస్తున్నాయి. నిజానిజాలు ఆ భగవంతునికే తెలుసు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం మాత్రమే ఉన్న తరుణంలో  త‌న‌ కున్న ఏ చిన్నపాటి అవ‌కాశాన్ని కూడా వ‌ద‌ల‌కుండా త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు ఝలక్ ఇచ్చే నిర్ణ‌యాల్ని తీసుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 

తాజాగా ఆయన అలాంటి మ‌రో నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్-డే ను పుర‌స్క‌ రించుకొని దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారమైన భార‌త‌ర‌త్న‌ను కర‌డు క‌ట్టిన కాంగ్రెస్ వాది మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి ఇవ్వ‌టం ఇప్పుడు రాజకీయాల్లో పెనుసంచ‌ల‌నంగా మారింది. ఏ ఇద్దరు రాజనీతిఙ్జులు కలసినా వారిమాటల్లో ఈ విషయం చర్చకు రాకుండా ఉండట్లేదు. స‌రిగ్గా  ఎన్నిక‌ల ముందు నరేంద్ర మోడీస్ మాస్ట‌ర్-స్ట్రోక్ గా ఈ నిర్ణ‌యాన్ని ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.  ప్ర‌ణ‌బ్ దా లాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదికి ఆ పార్టీ నీడ అంటేనే ప‌డ‌ని బీజేపీ ప్ర‌భుత్వం భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించ‌టం సంచ‌ల‌నంగా మారింది. 

అయితే ఈ నిర్ణ‌యం వెనుక అస‌లు కార‌ణం వేరని చెబుతున్నారు రాజకీయ విశ్లెషకులు.  త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌ బెంగాల్ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకునేందుకు వీలు గా పక్కా బెంగాలీ సాంప్రదాయవాది అయిన ప్రణబ్ దా కి భార‌త‌ర‌త్న పుర‌స్కార ప్ర‌క‌ట‌న చేసి ఉంటార‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌ మ‌వుతున్నాయి. ఈ విశ్లేష‌ణ‌ ఎలా ఉన్నా ఈ  రాజ‌కీయ ప్ర‌ముఖుడు ప్రణబ్ ముఖర్జీకి నేతృత్వం వ‌హించిన కాంగ్రెస్ పార్టీకి,  ఆగర్భ శత్రువైన భారతీయ జనతా పార్టీ ప్ర‌భుత్వం భార‌త‌ర‌త్న పుర‌స్కారం ప్ర‌దానం చేయ‌టం నరేంద్ర మోడీ స‌ర్కారుకు అతి పెద్ద  మైలేజీగా మార‌టం మాత్రం ఖాయం అంటున్నారు.

నరేంద్ర మోడీ ఈ తాజా నిర్ణ‌యం అతిపెద్ద సంచ‌ల‌నంగా మార‌టమే కాకాకుండా దేశ రాజకీయాల్లో ప్రత్యేకించి పశ్చిమ బంగ రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు తెరలెపుతుందని చెప్ప‌క త‌ప్ప‌దు. ముఖ్యంగా ఇది ముఖ్యమంత్రి మమత బెనర్జీని బెంగాల్ పౌరుల్లో ఇరుకున పడేసే అంశమే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: