రాష్ట్రపతి అభ్యర్థిపై కాంగ్రెస్లో తర్జనభర్జనలు

 హైదరాబాద్: గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్మన్ సోనియాగాంధీ, సీనియర్ నాయకులు అంటోని,ప్రణబ్ తదితరులు హాజరయ్యారు. ఈ కోర్ కమిటీ సమావేశంలో రాష్ర్టపతి అభ్యర్థిపై ప్రధానంగా చర్చ సాగినట్లు సమాచారం. రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రణబ్ అభ్యర్థతత్వంపై కాంగ్రెస్ పార్టీ మొగ్గును కనబరుస్తోంది. యూపీఏలోని భాగస్వామ్యమైన మమత నేత్రుత్వంలోని త్రుణముల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థితత్వంపై ఏకాభిప్రాయం అవసరమని మమత భావిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ప్రణబ్ ను నిలబెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. దీని కోసం కావల్సిన ఎత్తుల్ని, వ్యూహాలను అప్పుడే మొదలుపెట్టింది. ప్రస్తుతానికి ఇదే అంశంపై కాంగ్రెస్ ద్రుష్టిని మళ్లించింది. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తోంది. తాము అనుకున్న అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ యూపీఏ నుంచి మమత వెళ్లిపోతే...కొత్త మిత్రుల కోసం రెడ్ కార్పెట్ను పరిచింది. దీనికి లలూ వంటి నాయకులు మద్దతు పలికారు. రాష్ర్టపతి ఎంపిక యూపీఏ భాగస్వామ్య పార్టీలలో చీలికను కూడా తెచ్చేట్టుగా వుంది. అయినప్పటికీ కాంగ్రెస్ ఏ మాత్రం జంకడం లేదు. బెదరడం లేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రణబ్ అభ్యర్థితత్వానికి మొగ్గును కనబరస్తోంది. ఆ దిశగా తన అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకుంటోంది. మొత్తానికి రాష్ర్టపతి అభ్యర్థితత్వంపై కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించడానికి కాంగ్రెస్ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: