హైదరాబాద్: హస్తినలో రాష్ర్ట రాజకీయాలు వేడెక్కాయి. రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, సీఎం అందరూ ఢిల్లీలోనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఉన్న పీసీసీ చీఫ్ బొత్స ఇప్పటికే కేంద్ర నాయకులు గులాంనబీ ఆజాద్, వాయిలార్ రవి తదితరులతో ధర్మాన రాజీనామా వ్యవహారం, రాష్ర్టంలో నెలకున్న తాజా రాజకీయాలపై చర్చించారు.
తాజాగా ఢిల్లీ వెళ్లిను కిరణ్ కూడా రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తున్నారు. మరో పక్కన రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మాజీ మంత్రి శంకర్రవావు తదితరులు కూడా సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. సోనియాను కలిసిన శంకర్రావు ముఖ్యమంత్రి కిరణ్ పై ఫిర్యాదు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అంతే కాకుండా, తనను కిరణ్ కుమార్ అన్యాయంగా మంత్రి వర్గం నుంచి తొలగించారంటూ ఫిర్యాదు చేయడమే కాకుండా, సీఎం వ్యవహారం ఏదో ఒకటి త్వరగా తేల్చండనీ కోరినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి మార్పు, మంత్రివర్గ ప్రక్షాళనపై జోరుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో సోనియాగాంధీతో చిరంజీవి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకంది. మొత్తానికి రాష్ర్ట రాజకీయాలతో ఢిల్లీలో సందడిగా మారింది.
మరింత సమాచారం తెలుసుకోండి: