బాబు గారూ! మీరు అద్భుతం! ఇక కేంద్రం విపక్షం ఎందుకు? మీరే లాగించెయ్యండి!

ఆంధ్ర ప్రదెశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం ఎంతో సాదించేసిందని చెబుతున్నారు. రెండో శ్వేతపత్రం విడుదలచేసిన ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలతో ముందుకెళ్తున్నామని వివరించారు. మీడియాలో ఆయన చేసిన ప్రసంగంలో సంక్షిప్తంగా ఒక భాగం ఇలా ఉంది.

*సులభతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో ఉన్నాం. 
*హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ 44వ స్థానంలో ఉంది. హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవాలనేది లక్ష్యం. 
*అన్నిశాఖల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. 
*మీ సేవ, ఈ ఆఫీస్‌, ఈ క్యాబినెట్‌, వయాడక్ట్‌ తీసుకువచ్చాం. 
*దేశంలో వ్యవసాయ రంగం వృద్ధిరేటు 2.4 శాతం ఉండగా, ఏపీలో వ్యవసాయ రంగం వృద్ధిరేటు 11శాతంగా ఉంది. 

*రసాయనాలు లేని పంటలు పడిస్తే పర్యావరణం బాగుంటుంది. 
*రైతుల ఆదాయం రెట్టింపు చేయగలిగాం. 
*భూధార్‌ ద్వారా అక్రమాలు జరగకుండా చూస్తున్నాం. 
*23.50 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ‌ కొరత ఉంటే రెండు నెలల్లో అధిగమించాం. 
*విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌. 

*రైతుల వద్ద మిగిలిన సౌర విద్యుత్‌ను ఒక్కో యూనిట్‌ను రూ.1.50పైసలకు కొనుగోలు చేస్తాం. 
*అన్ని వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారుస్తాం. 
*ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారా కాలుష్యం తగ్గుతుంది 

అని ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఇంత చేస్తే కేంద్రంతో పని ఏముంది? మళ్లీ కేంద్రాన్ని, ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చంద్రబాబు ఎందుకు విమర్శిస్తున్నట్లు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: