తెలంగాణా ఎన్నికల రివ్యూ 2018..!

KSK
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో తెలంగాణ ఎన్నికల కమిషన్ తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో చాలామంది తెలుగు సినీ ప్రముఖులు మరియు రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియోగం చేసుకుని సోషల్ మీడియాలో తమ ఫోటోలతో అదరగొట్టారు. మరియు ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అధికారి రజత్ కుమార్ తీసుకున్న నిర్ణయాలతో చాలామంది మందుబాబులు పోలింగ్ బూత్ దరిదాపు న లేకపోవడం నిజంగా విశేషం. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రజత్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో జరిగిన ఎన్నికలలో పెద్ద సంచలనం అని అంటున్నారు చాలామంది రాజకీయ నేతలు మరియు సామాజిక నేతలు. అయితే చాలా చోట్ల ఓటింగ్ శాతం పెరిగిన కానీ హైదరాబాద్ నగరంలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. దీనికి కారణం సెలవులే అని అంటున్నారు చాలామంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగడంతో తెలంగాణ ఎన్నికల కమిషన్ ఊపిరిపీల్చుకుంది. మరోపక్క తెలంగాణ రాజకీయ పార్టీ నేతలు ఎవరి విజయంపై వారు ధీమాగా మాట్లాడుతున్నారు.


వోటింగ్ శాతం : తెలంగాణలో ఓటింగ్ శాతం పరిశీలిస్తే ఎక్కువ పట్టణాల్లో కంటే పల్లెల్లోనే అధిక శాతం ఓటింగ్ నమోదయింది. చదువుకున్న పట్టణాల్లో కంటే అక్షరాస్యత తక్కువగా ఉన్న పల్లెల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువ నమోదు కావడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పోలింగ్ శాతం 35శాతానికి మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంమీద చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 59శాతం పోలింగ్ నమోదైంది.


కెసిఆర్ మీద ఫిర్యాదు : టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కెసిఆర్ తన ఓటు హక్కు వినియోగించుకునే బయటకు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వడాని తప్పుబట్టారు రెండు జాతీయ పార్టీల నేతలు. నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్ వద్ద ఏ పార్టీ వారు ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. కానీ కేసీఆర్ ఓటేసి భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వస్తున్నామని తెలపడంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ అయ్యారు.


సెల్ ఫోన్ కోసం ఓట్లు మానేశారు: మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. దీంతో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది యువత మొబైల్ ఫోన్ పట్టుకుని పోలింగ్ బూత్ వద్దకు రావడంతో..ఇదే క్రమంలో ఎన్నికల అధికారులు సెల్ ఫోన్లతో రావద్దని సూచించడంతో వారంతా ఓటింగ్ వేయకుండానే వెనుదిరగడం కనిపించింది. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటును కేవలం సెల్ ఫోన్ కారణంగా చాలా మంది వేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  


ఎన్నికల అంకం ముగిసింది .. ఇక లెక్కింపు ప్రక్రియ 11 న మొదలు అవుతుంది. తెలంగాణా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆ రోజునే తేలబోతోంది. సామాన్యుడి నాడి - సామాన్యుడి గుండె చప్పుడు ఇప్పుడు ఈవీఏం లలో నిక్షిప్తం అయ్యి ఉంది. ఈ పరిస్థితి లో తెలంగాణా అంతా నాలుగు రోజుల పాటు హై టెన్షన్ ఉండబోతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: