జగనా...జనసేనా... !!
ఆ యువ హీరో రాజకీయాల్లో చేరేందుకు ఉరకలేస్తున్నాడు. ఈ మధ్యనే తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తానంటూ ఓ లేఖ కూడా ప్రజలకు విడుదల చేశాడు. ఆయన తరువాత అడుగులేంటన్న చర్చ ఇపుడు సాగుతోంది. మంచి నటుడైనా ఈ మధ్య సరైన హిట్లు లేకపోవడంతో ఈ హీరో రేసులో బాగా వెనకబడ్డాడు. దాంతో రూట్ మార్చి పాలిటిక్స్ లో తన లక్కును పరీక్షించుకుందామాని డిసైడ్ అయ్యాడు.
జనసేనా :
ఇప్పటికే రాజకీయాల్లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్న సంకేతాలు ఇచ్చిన మంచు వారబ్బాయి మనోజ్ ఏ పార్టీలోకి వె ళ్తారన్నది ఇంటెరెస్టింగ్ మ్యాటరే మరి. ఆయన త్వరలో పవన్ కళ్యాన్ తో చేతులు కలపబోతున్నారా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రజాసమస్యలపై పవన్ స్పందిస్తున్న తీరు గురించి, అయన్ని అభినందిస్తూ మనోజ్ చేస్తున్న కామెంట్స్ ఇందుకు కారణమని చెబుతున్నారు. అయితే మోహన్ బాబు కుటుంబానికి, వైసిపి అధినేత జగన్ కి ఉన్న బంధుత్వాల నేపధ్యంలో జగన్ని కాదని, మంచు మనోజ్ పవన్ వైపు వెళతారా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నా, మనోజ్ మాత్రం ఇప్పటికైతే ఎటూ తేల్చలేదుట.
జగన్ వైపేనా :
పదిహేను రోజుల్లో తన రాజకీయ ప్రస్తానంపై మరింత క్లారిటీ ఇస్తానని చెబుతున్న మనోజ్, చివరికి తండ్రి ఒత్తిడికి తలొగ్గి జగన్ వైపు వెళతారా.. లేక తనకిష్టమైన పవన్ వైపు వెళతారో చూడాలి. ఏది ఏమైనా రాజకీయాల్లో మంచు వారబ్బాయి రాణించేందుకు బాగానే తెర వెనక కసరత్తు చేస్తున్నారుట. ఇప్పటికే సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న ఆయన రాజకీయాలపై మంచి అవగాహనే పెంచుకుంట్లు టాక్. మరి చూడాలి ఈ రంగంలో మంచు వారబ్బాయి వీరంగం ఎలా ఉంటుందో.