దీదీ మమత పాలనలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే కుప్ప కూలిన మూడు ఫ్లైఓవర్లు

బాజపా, నరెంద్ర మోడీ పై ఉవ్వెత్తున ఎగిసిపడే విప్లవ కేరటం దీది. అలాంటి నిప్పు రవ్వ పాలించె వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉండగానే మరో ఫ్లైఓవర్ కుప్ప కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌ లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని కాకద్వీప్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించ లేదని అధికారులు చెబుతున్నారు. 

అయితే రాష్ట్రంలో వరుసగా నిర్మాణాలు, వంతెనలు కూలిపోతుండటం ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. యదావిధిగా ఫ్లై ఓవర్ కుప్ప కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాలనాగిని నదిపై చేపట్టిన ఈ నిర్మాణంలో ఎన్నో లోపాలున్నాయని స్థానికులు మీడియాకు చెబుతున్నారు. నిర్మాణం పూర్తయి ఉంటే అపార ప్రాణనష్టం జరిగుండేదని అంటున్నారు.  


రెండు ఫ్లై ఓవర్లు ఈ నేల మొదటి వారంలోనే కూలిపోయినా ఇంకా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మేలుకోలేదు, సరికదా ఈ రోజు ఉదయం (సెప్టెంబర్ 24) ఈ సంఘటన జరగటం ఆమె రాజకీయ పతనానికి  'వేకప్-కాల్'  గా భావించకపోతే ఆమె పట్ల జనంలో ఉదృతమయ్యే వ్యతిరేఖత కార్చిచ్చులా వ్యాపించక ముందే తేలుకోకపోతే ఎన్నికల్లో ప్రజలే బుద్దిచెపుతారు. ప్రభుత్వం  గుత్తేదార్ల దోపిడీ పట్ల సానుకూల వైఖరి ఇదే అని భావిస్తూనే ఉన్నారు. 


కాగా, మొదటగా ఈ నెల అంటే సెప్టెంబర్ 4వ తేదీన దక్షిణ కోల్‌కతా లోని ఓ ప్రాంతంలో మజేర్‌-హట్ బ్రిడ్జి కూలడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 24మంది గాయపడ్డారు. ఆ తర్వాత మూడు రోజులకే అంటే సెప్టెంబరు 7న ఉత్తర బెంగాల్‌ లోని సిలిగురిలో మరో బ్రిడ్జి కూలిపోయింది. ఆ ప్రమాదంలో ఓ ట్రక్కు డ్రైవర్‌ గాయపడ్డ విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: