ఇలాంటి చెత్త సినిమా తీయకు.. మహేశ్ కు కేటీఆర్ షాక్..!?

Chakravarthi Kalyan
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అందరు మంత్రుల్లా కాదు.. ఆయన కాస్త డిఫరెంట్..  మిగిలిన తెలంగాణ నేతల్లా రఫ్ కాదు.. కాస్త మోడ్రన్.. ఆయనకు సినిమా రంగంలోని వారితోనూ మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. నాగార్జున, మహేశ్ బాబు రాంచరణ్ వంటి హీరోలతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. అంతే కాదు.. ఆయా హీరోలకు వారి సినిమాల ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తుంటారట. 


ప్రత్యేకించి మహేశ్ బాబు అంటే కేటీఆర్ కు చాలా స్నేహమట. అయితే స్నేహం ఉంది కదా అని వాళ్ల సినిమాల విషయంలో మాత్రం మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టేస్తారట. తాజాగా మహేశ్ బంపర్ హిట్ సినిమా భరత్ అనే నేను.. సినిమా గురించి ఇంటర్వ్యూలో వీరిద్దరూ ముచ్చటించారు. కేటీఆర్ భరత్ అనే నేను సినిమా చూసి ఎలా స్పందిస్తారో అని మహేశ్ బాబు భయపడ్డారట. 



ఎందుకంటే.. గతంలో తన ఆగడు సినిమా చూసి కేటీఆర్ చాలా నిర్మోహమాటంగా బాగా లేదని చెప్పేశారట. మహేశ్..ఇలాంటి చెత్త సినిమాలు ఇక ముందు తీయకు అని మొహం మీదే చెప్పేశారట. ఆ అనుభవం దృష్టిలో ఉంచుకుని మహేశ్ బాబు భరత్ సినిమా గురించి కేటీఆర్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందోనని భయపడ్డారట. 


కానీ మహేశ్ బాబు భయపడినట్టుగా కేటీఆర్ నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదట. సినిమా చాలా బావుందని కేటీఆర్ మెచ్చుకున్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. సినిమా రంగం పట్ల గౌరవం పెంచే సినిమా భరత్ అనే నేను.. అని కితాబిచ్చారట కేటీఆర్.. మొత్తానికి కేటీఆర్ కు ఈ సినిమా బాగా నచ్చిందన్నమాట. బహుశా మహేశ్ పాత్రలో ఆయన తనని ఊహించుకుని ఉండొచ్చుగా.. ఏమంటారు..!?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: