ఫిలింనగర్ లో నగ్నంగా ఆత్మహత్య చేసుకుంటా..!?

frame ఫిలింనగర్ లో నగ్నంగా ఆత్మహత్య చేసుకుంటా..!?

Chakravarthi Kalyan
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశంపై చర్చ కొత్త పుంతలు తొక్కుతోంది. మొన్నటికి మొన్న శ్రీరెడ్డి అర్థనగ్నంగా ప్రదర్శన చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టాలీవుడ్ లోని చీకటి కోణంపై చర్చకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు మరో నటి తాను కూడా శ్రీరెడ్డి తరహాలోనే ముందుకు పోతానని చెబుతోంది. ఈమె ఏకంగా నగ్నంగా ఆత్మహత్య చేసుకుంటా అని హెచ్చరిస్తోంది. 

Image result for casting couch in tollywood

తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీలపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుదీర్ఘ చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో శ్రీరెడ్డితో పాటు పలువురు అమ్మాయిలు, మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారిలో సోనా రాథోడ్ అనే ట్రాన్స్ జాండర్ ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది. అవకాశాల కోసం తాను వెళ్లిన సమయంలో తనను లైంగికంగా వేధించారని సోనారాథోడ్ చెబుతోంది. 

Image result for tollywood WOMEN

తనకు అవకాశాలు ఇవ్వకపోతే.. న్యాయం చేయకపోతే.. ఏకంగా ఫిలింనగర్లో నగ్నంగా ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ఆవేశంగా స్పందించిన సోనారాథోడ్ ఆ తర్వాత అక్కడే ఏడుపుతో కుప్పకూలింది. ఆ తర్వాత సముదాయించుకుని మాట్లాడింది. ఇప్పటికే శ్రీరెడ్డి అర్థనగ్నప్రదర్శనతో టాలీవుడ్ లోని చీకటి కోణాలు మీడియాకు మంచి ముడిసరుకుగా మారాయి. 


అంతకుముందు శ్రీరెడ్డి కూడా తాను అర్థనగ్నప్రదర్శన చేస్తానని ముందే వార్నింగ్ ఇచ్చి  ఆ తర్వాత అన్నంత పనీ చేసింది. ఇప్పుడు సోనారాథోడ్ కూడా అదే పని చేస్తే ఇక టాలీవుడ్ పరువు గంగపాలు కావడం ఖాయం. కానీ ఇంత జరుగుతున్నా ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ పై స్పందించకపోవడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: