ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకహోదా ఫీవర్ నడుస్తుంది. విభజన హామీల చట్టంలోని అంశాలకు తూట్లు పొడుస్తూ అసలు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే ప్రసక్తే లేదని బీజేపీ సర్కార్ తేల్చేసిన విషయం తెలిసిందే. ఎలాగైనా ప్రత్యేకహోదాపై పోరాటం జరిపి దాన్ని సాధించి వచ్చే ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని రాష్ట్రంలోని పలు పార్టీలు తాపత్రయపడుతున్నాయి.
ఇప్పటికే తమ పదవులకు రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు తమ ప్రాణాలకు మీదకు తెచ్చుకొని నిరాహారదీక్షకు కూర్చున్నారు. జగన్ చేపడుతున్న కొత్త వ్యూహాలకు కౌంటర్ వ్యూహాలను రచించకపోతే ఓటమి తప్పదన్న భయంతో ఢిల్లీలో హోదాపై పోరాడుతున్న తన ఎంపీలను రాష్ట్రానికి తిరిగి వచ్చేయాలని బాబు ఆదేశించాడు.
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలో బస్సు యాత్ర చేసి జనాలకు మరింతగా చేరువవ్వాలని బాబు భావించాడు. ఈ యాత్రపై రూట్‌మ్యాప్‌ను తయారుచేయడానికి, నిర్ణయించడానికి ఢిల్లీలో ఉన్న ఎంపీలను రమ్మని టెలీకాన్ఫరెన్సులో చెప్పగా వారు మేము పాల్గొనలేము అని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిన్న జరగవలసిన మీటింగును సైతం నిర్వహింహలేదట. దీంతో చేసేదేమి లేక ఇంకో ఎత్తుగడ వేసే పనిలో ఉన్నాడంట బాబు.