కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో..ఏడుగురు భారతీయులు మృతి

siri Madhukar
ఈ మద్య ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అత్యధిక వేగం..డ్రైవర్ల నిర్లక్ష్యం..టెక్నికల్ ఇబ్బందుల వల్ల రోడ్డు ప్రమాదాల్లో వందల మంది దుర్మరణం పాలు అవుతున్నారు.  కువైట్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. బుర్గాన్ చమురు క్షేత్రం సమీపంలో అల్-అర్టల్ రోడ్డుపై రెండు బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ (కేఎఫ్ఎస్‌డీ) తెలిపింది.  భారత దేశం నుంచి ఎంతో మంది విదేశాల్లో డబ్బు సంపాదించడం కోసం వెళ్తున్నారు.

ముఖ్యంగా దుబాయ్, కువైట్, అరబ్ కంట్రీస్ లో పనిచేస్తు డబ్బు సంపాదిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కువైట్ లో పనికోసం వెళ్లిన భారతీయులు బస్ ప్రమాదంలో చనిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. కార్మికులతో బయలుదేరిన రెండు బస్సులు ఢీకొన్నాయని, ఈ ఘటనలో మొత్తం 15 మంది చనిపోయారని కువైట్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

వీరిలో ఏడుగురు భారతీయులు కాగా, ఐదుగురు ఈజిప్షియన్లు, ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో మరో ఇద్దరు భారతీయ కార్మికులకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో..వారి పరిస్థితి విషయమంగా ఉందని తెలిపారు.  సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బస్సులో నలిగిపోయిన మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: