కిరణ్ కోర్టులోనే ధర్మానంటున్న గవర్నర్

 హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు రాజీనామా అంశంపై కొనసాగుతున్న సస్పెన్స్కు గవర్నర్ నరసింహాన్ కొంత తెరదించారు. ధర్మాన రాజీనామా తన కోర్టులో ఉందంటూ జరుగుతున్న ప్రచారానినికి గవర్నర్ బ్రేక్ వేశారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా పంచాయితీని గవర్నర్ నరసింహాన్ చాకచక్యంగా తప్పించుకున్నాడనీ చెప్పొచ్చు. అంతేకాదు, రాజీనామా అమోదం తప్పదనీ పరోక్షంగా సంకేతాలతిచ్చారు. ధర్మాన రాజీనామా అంశం తన చేతుల్లో లేదనీ, సీఎం కిరణ్ చెబితే తాను అమోదింపచేస్తానంటూ ధర్మానను కిరణ్ కోర్టుకు బదిలీ చేశారు. ధర్మాన రాజీనామాను అమోదించాల్సిందిగీ సీఎం తనకు పంపిస్తే అమోదించడానికి సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్ చెప్పి సీఎంను కొంత టెన్షన్కు గురి చేశారు. ఇప్పటి దాకా ధర్మాన వ్యవహారం గవర్నర్ వద్ద ఉందనీ అందరూ అనుకున్నారు. కానీ, గవర్నర్ మాత్రం బంతి కిరణ్ కోర్టులోనే ఉందనడం చర్చనీయాంశంగా మారింది. ధర్మాన పంచాయితీ మళ్లీ సీఎం వద్దకు చేరింది. బంతి కిరణ్ కోర్టుకు చేరడంతో ఇప్పుడాయన ఏం చేయబోతారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాన్ పిక్ ప్రాజెక్టులో సీబీఐ ధర్మానతో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ లపై చార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు ఆ ముగ్గుర్ని ప్రాసిక్యూషన్ చేయాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరింది. దీనితో ధర్మాన ప్రసాదరావు తన మంత్రి పదవీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం కిరణ్కు అందజేశారు. రాజీనామాను సీఎంకు తనకున్న అధికారంతో తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టారు. ప్రాసిక్యూషన్కు సంబంధించిన అధికారం సీఎం చేతుల్లో ఉండదు. ప్రాసిక్యూషన్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి. ధర్మాన చేసిన రాజీనామా లేఖను సీఎం ప్రస్తుతానికి తన వద్దనే వుంచుకున్నారు.  దానిని గవర్నరుకు పంపితే రాజీనామా అమోదిస్తారా? ప్రాసిక్యూషన్కు అనుమతి ఇస్తారా? అనేది  చర్చనీయాంశంగా మారింది. ధర్మాన రాజీనామా, ప్రాసిక్యూషన్కు సంబంధించి సీఎం కిరణ్ న్యాయనిపులు, ఢిల్లీ పెద్దలతో పాటు, గవర్నరుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ధర్మానను ప్రాసిక్యూషన్కు అనుమతి ఇస్తే తప్పు చేసినట్లే. దీనితో గవర్నర్ ఇప్పుడు ఏం చేయబోతారో అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో సాక్షాత్తు గవర్నరే మంత్రి రాజీనామాపై రాష్ర్ట ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ధర్మాన రాజీనామాను అమోదించమనీ ముఖ్యమంత్రి పంపిస్తే అమోదిస్తానంటున్నాడు. ధర్మాన రాజీనామా తన పరిధిలో ఉందనీ జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. gగవర్నర్ మాటలను బట్టి ధర్మాన రాజీనామా తప్పదా? అని ప్రచారం జోరందుకుంది. ధర్మాన రాజీనామాను అమోదింపచేస్తే మరిన్ని సమస్యలు తలెత్తుతాయనే ఆలోచనలో ఉన్న కిరణ్ కొంత కాలం ఆగి చూద్దామనుకున్నారు. కానీ, గవర్నర్ మాత్రం రాజీనామా ఫైలును పంపిస్తే అమోదించడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. దీన్ని బట్టి ధర్మాన రాజీనామా అమోదానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ధర్మాన రాజీనామాను అమోదించకుండా, వెనకేసుకువస్తే...అది కాస్త జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరవచ్చనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. జగన్కు లాభం జరగడం కాంగ్రెస్కు సుతారం ఇష్టం లేదు. గవర్నర్ మాటలతో రేపో, మాపో ధర్మాన ప్రసాదరావు రాజీనామాను అమోదించడం తథ్యంగా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: