నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సైకోలు రెచ్చిపోతున్నారు. మొన్ననే నెల్లూరు జిల్లాలో ఓ సైకో 11 మంది మహిళలను గాయపరిచాడు.. ఓ వృద్ధురాలిని రేప్ కూడా చేశాడు. ఈ సంగతి మరిచిపోకముందే ప్రకాశం జిల్లాలో మరో సైకో రెచ్చిపోతున్నాడు. ఒంగోలులో మహిళను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒంగోలులోని ఓ లేడీస్ హాస్టల్లో విద్యార్థులు సైకో దాడితో భయపడిపోతున్నారు.
ఒంగోలులోని గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో అర్థరాత్రి సైకో వీరంగం వేశాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే గిరిజన కళాశాల బాలికల వసతి గృహం ఉంది. జిల్లాలోని దూరప్రాంతాల నుంచి వచ్చిన 40 మంది వరకూ గిరిజన విద్యార్థినులు ఈ వసతి గృహంలోనే ఉండి చదువుకుంటున్నారు. అసలే పరీక్షల సమయం కావడంతో విద్యార్థినులు అర్థరాత్రి వరకు చదువుకుంటున్నారు.
ఈ సమయంలో గోడ దూకి వసతి గృహంలోకి వచ్చిన ఓక సైకో బీభత్సం సృష్టించాడు. ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కేవలం డ్రాయర్ తోనే సదరు సైకో లేడీస్ హాస్టళ్లోకి వచ్చాడు. దాంతో విద్యార్థినులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ సైకోగాడు విద్యార్థినుల మీద మీదకు వచ్చి అత్యాచార యత్నం చేశాడు. ఎక్కువ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఇంతలో ఓ అమ్మాయి ధైర్యంగా పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి సైకోను అదుపులోకి తీసుకున్నారు.