కొడుకు "బూతు" చూస్తుంటే.. తండ్రి అది నరికేశాడు.. ?

Chakravarthi Kalyan
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలోనూ కనిపిస్తోంది. నగరాల్లో దీని జోరు మరీ ఎక్కువ. దీనికితోడు చవక ప్లాన్లతోనే ఇంటన్ నెట్ కూడా దొరికేస్తోంది. జీబీల కొద్దీ డేటా తక్కువ ధరకే వస్తోంది. ఇక ఇంటర్ నెట్లో కావలసినంత బూతు ఏ అడ్డూ అదుపూ లేకుండా లభిస్తోంది. మరి ఇక యూత చెడిపోకుండా ఉండమంటే ఉంటారా.. అందుకే టీనేజీ కుర్రాళ్లు స్మార్ట్ ఫోన్ వదలడం లేదు. 


ఉద్యోగాలు, పనీ పాట, చదువులూ ఇవేమీ పట్టకుండా ఎప్పుడూ ఫోన్లోనే బిజీగా ఉండే కొడుకును చూసి ఓ తండ్రికి యమా మండింది. అంతే చేతిలో ఉన్న కత్తి తీసుకుని ఒక్క వేటుతో నరికిపారేశాడు.. ఏంటీ నరికింది అనుకుంటున్నారా.. మీరనుకున్నట్టు కాదు లేండి.. చేయి నరికిపారేశాడు.. మరీ ఎంత కోపం వస్తే మాత్రం కన్న తండ్రి చేయి నరుకుతాడా అనుకుంటున్నారా.. నిజమండీ బాబు..


ఇది జరిగింది హైదరబాద్ లోనే.. పాతబస్తీలోని పహాడీషరీఫ్‌ జల్‌పల్లిలో ఖయ్యుం ఖురేషి అనే మాంసం వ్యాపారి ఉన్నాడు. ఆయన పెద్దకుమారుడు మహ్మద్‌ ఖాలెద్‌ ఖురేషీ పోర్న్ వీడియోలకు బానిసయ్యాడు. తండ్రి ఏదో చిన్న ఉద్యోగంలో పెట్టించినా ఆ పనికీ వెళ్లడం లేదు. ఎప్పుడూ చూసినా ఒకటే పోర్న్ థ్యాస.. ఎంత మందలించినా వినకపోవడంతో కోపం వచ్చి మాంసం కత్తితో కుమారుడి కుడి చేయి నరికేశాడు. 


కుర్రాడు ఖాలెద్‌ కేకలతో పరుగెత్తుకొచ్చిన తల్లి లబోదిబోమంటూ ఆసుపత్రికు తీసుకెళ్లింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు ఖాలెద్. ఇది జరిగిన తర్వాత ఖయ్యుం ఎందుకైనా మంచిదని తానే పోలీసుల వద్దకెళ్లి లొంగిపోయాడు. మరి హాస్పటల్ నుంచి ఇంటికొచ్చాకైన ఖాలెద్ బుద్ధిగా ఏదో ఒక పని చేసుకుంటాడా.. లేక.. ఒంటి చేత్తో అయినా సరే పోర్న్ చూస్తానంటాడా.. చూడాలి. మరి ఏం జరుగుతుందో..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: