పెళ్లి.. మన భారతీయ సమాజంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది కూడా మన వివాహ వ్యవస్తే. దాంపత్య జీవనానికి మన వాళ్లు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. విడాకులు, మారు పెళ్లిళ్ల శాతం మన దేశంలోనే చాలా తక్కువ. మరి పెళ్లిల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్లు పెరుగుతున్నాయి.
కానీ.. ఒకప్పుడు రాజుల కాలంలో గాంధర్వవివాహాలు, రాక్షస వివాహాలు జరిగేవి. అమ్మాయికి అబ్బాయి నచ్చకపోయినా.. అమ్మాయిని ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకోవాడాన్నే రాక్షస వివాహం అంటారు. ఇప్పుడు మనదేశంలో ఇలాంటి రాక్షస వివాహాలు కొన్ని చోట్ల జరగుతున్నాయట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇప్పుడు అమ్మాయిలను ఎత్తుకెళ్లడం లేదు.
అబ్బాయిలనే ఎత్తుకెళ్లి మరీ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారట. ఈ విచిత్రాలు ఎక్కువగా బీహార్ లో జరుగుతున్నాయట. అక్కడి అధికారుల లెక్కలప్రకారం 2014 ఏడాదిలో 2,526 రాక్షల వివాహాలు జరిగాయట. 2015 లో 3,000 జరిగాయట. 2016లో 3,070 మంది అబ్బాయిలను బలవంతంగా కిడ్నాప్ చేసి పెళ్లి చేశారట. 2017 లో ఈ బలవంతపు పెళ్లిళ్ల సంఖ్య 3,405కు చేరిందట.
సమాజంలో స్థితిమంతులు, జీవితంలో మంచి ఉద్యోగాల్లో ఉన్నవారు.. అన్ని విధాలా స్థిరపడిన వారిని టార్గెట్ చేసి బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లిళ్లు చేస్తున్నారట. మరికొందరిని తుపాకులతో బెదిరించి మరీ పెళ్లి చేయిస్తున్నారట. పెళ్లి వరకూ బాగానే చేయిస్తారు. మరి ఆ తర్వాత కాపురాలు ఎలా చేయిస్తారు.. ఆ పెళ్ళిళ్లు నిలుస్తాయా.. కలకాలం సాఫీగా సాగుతాయా అంటే ఆలోచించాల్సిందే.