దినేష్ రెడ్డి నియామకం చెల్లదు:క్యాట్ తీర్పును సమర్ధించిన హైకోర్టు

 హైదరాబాద్: డీజీపీ దినేష్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. దినేష్ రెడ్డి నియామకం సరైంది కాదన్నది. ఆయన నియామకం చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్దించింది. వారంలోగా డీజీపీ స్థా యి అధికారుల వివరాలను యూపీఎస్సీకి పంపాలనీ కూడా హైకోర్టు రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూపీఎస్సీ నివేదిక అందగానే కొత్త డీజీపీని నియమించాలనీ సూచించింది. డీజీపీ నియామకం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా పరమైన వివాదాల పరిష్కారం చేసే న్యాయస్థానం(క్యాట్) ఇచ్చిన ఆదేశాలపై దినేష్, ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా క్యాట్ ఇచ్చిన తీర్పును సమర్ధించడమే కాకుండా, కొత్త డీజీపీని నియమించాలని సూచించింది. కొత్త డీజీపీ నియామకం జరిగే వరకు దినేష్ రెడ్డిని ఇంఛార్జిగా కొనసాగాలనీ కూడా కోర్టు సూచించింది. ఇదిలా ఉంటే సీనియారిటీ ప్రకారం డీజీపీ నియామకం జరగలేదంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతంకుమార్ క్యాట్ను ఆశ్రయించిన విషయం విధితమే. డీజీపీ నియామకం చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లగా అక్కడే కూడా దినేష్కు చుక్కెదురైంది. అంతే కాదు, రాష్ర్ట ప్రభుత్వానికి హైకోర్టు 5వేల జరిమాన కూడా విధించింది. అయితే, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: