సఫలం – విఫలం

Kuthuru RajiReddy
ఫీజు రియింబర్స్ మెంట్ విషయంలో వృత్తి విద్యా కోర్సుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి పితాని చెబుతుండగా, అటువంటిది ఏది లేదని చర్చలు విఫలమయ్యాయని కళాశాల యాజమాన్యాల నాయకులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజును 35 వేల వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించగా ఇందుకోసం 90శాతం కళాశాలలు అంగీకరించాయని 10శాతం కళాశాలల యాజమాన్యం అంగికరించక పోవడం సహజమేనని మంత్రి అంటుండగా యాజమాన్యం నాయకులు కొందరు ఫీజుల పెంపు కోసం పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతుంది. విద్యార్థులకు కౌన్సిలింగ్ తేదిలను ప్రకటిస్తామని మంత్రి పితాని పేర్కొంటుండగా కొన్ని కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించాయి. ఫీజుల రియింబర్స్ మెంట్ విషయం న్యాయస్థానాల వరకు వెళ్లితే మరింత జాప్యం జరిగే అవకాశముందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే కౌన్సిలింగ్ లో కోంత ఆలస్యం జరిగిందని మరింత జాప్యం జరిగితే విద్యార్థులకు నష్టం జరిగే అవకాశాలున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈవిషయాన్ని తొందరగా పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: