లేచిపోదాం వస్తావా.. అంటూ హీరో నాగార్జును ఆటపట్టించిన అలానాటి అందాల నటి గిరిజ గుర్తుందా... ఔను.. గీతాంజలి వంటి ప్రేమ కావ్యాన్ని ఎవరు మాత్రం మర్చిపోతారు లెండి. ఆ సినిమాతోనే వంద సినిమాల ఖ్యాతి సంపాదించిన హీరోయిన్ గిరిజ. అయితే ఆ సినిమా తర్వాత మాత్రం గిరిజ సినిమాలపై ఎక్కువగా దృష్టి సారించలేదు. మరి ఇప్పుడు ఆమె ఏంచేస్తోంది.
గీతాంజలి తర్వాత గిరిజ మనసు దేవుడు, భక్తి వంటి ఆధ్యాత్మిక విషయాలవైపు మళ్లిందట. నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి పాండిచ్చేరిలో అరవింద ఆశ్రమంలో చేరిందట. ఆ తర్వాత యోగా, స్పిరిట్యువల్ సైకాలజీ వంటి అంశాల్లో డాక్టరేట్ కూడా చేసిందట. గిరిజ స్వస్థలం బ్రిటన్.. బ్రిటీష్ తల్లికీ, కన్నడ తండ్రికీ పుట్టిన ప్రేమ ఫలం గిరిజ. ఆ తర్వాత లండన్ వెళ్లిపోయింది.
డాక్టరేట్ తర్వాత ఇదే అంశాలపై ఆమె అనేక పుస్తకాలు కూడా రాసిందట. ప్రస్తుతం ఆమె లండన్ లో జర్నలిస్టుగా పని చేస్తోందట. ఎక్కడి ఇండియా.. ఎక్కడి గీతాంజలి.. ఎక్కడి భక్తి మార్గం.. ఎక్కడి లండన్.. నటన నుంచి పాత్రికేయం.. అదే కదా జీవితం.. ఎప్పుడు ఏమవుతుందో జీవితం ఏ గడియలో ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పగలరు.