ఉత్తరతెలంగాణలో సేద్యం ఇక భారం కానుంది. ఆగస్టు పోతున్నా వర్షాల జాడలేదు,ప్రాజెక్టులు నిండలేదు,పలితం సగానికి పైగా భూముల్లో నాగళ్లు తిరగలేదు. ప్రధానజీవనోపాది వ్యవసాయం ఈసారి సాయం చేయనుంటోంది.నిండు వర్షాకాలంలోను చుక్కనీటికోసం పరితపించే పరిస్థితి.ప్రాజెక్టులున్నా పలితం సున్నా.ఏప్రాజెక్టు లోకి సాగునీరందించే స్థాయిలో నీరు చేరుకోలేదు. ఇదీ ఉత్తరతెలంగాణలోని ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్,నిజామాబాద్ జిల్లాల పరిస్థితి. గోదావరే ఈప్రాంతానికి ప్రధాన జలవనరు, ఇదిపరవళ్లు తొక్కింది,చక్కటిసాగునీరును సముద్రం పాలుచేసింది. కాని ఉత్తరతెలంగాణ పై సీతకన్నువేసింది. ఈనాలుగు జిల్లాలకు ప్రాణాధారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.ఇది ఇంకా బోసిగానే ఉంది. ఇదికాక కడం,స్వర్ణ,సాథ్నాల,మానేరు వంటి ప్రాజెక్టులెన్నో నీళ్లునిండక రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది.ఒక ఎస్సారెస్పి కిందనే ఉత్తరతెలంగాణలో 18లక్షల వరి సాగవుతుంది.ఈసారి పంటను ఈఆయకట్టులో 10లక్షల ఎకరాల్లో కూడా మొదలు పెట్టలేదు. జూలై చివరివారంలో భారీవర్షాలు కురిసినా సేద్యం చేసే అవకాశాలుండేవి.ఇప్పుడు సమయం మించి పోవడంతో వరి సాగు ఇక సాగనట్లే. ఆదిలాబాద్ జిల్లాలో కడం కింద 30వేల ఎకరాలు,సదర్మాట్ కింద 27వేల ఎకరాలు,స్వర్ణ కింద 15వేల ఎకరాలు,కరీంనగర్ జిల్లాలో మానేరు కింద దాదాపు 20 వేల ఎకరాలు, ఇలా మిగిలిన దాదాపు అన్ని ప్రాజెక్టుల కింద పెద్ద మొత్తంలో వరిసాగు ఈసారి ప్రశ్నాత్మకంగా మారింది. దీంతో ఉపాదిలేక మళ్లీ రైతుకుటుంబాలు గల్ఫ్ దేశాలకు వెల్లే పరిస్థితులు వచ్చేలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికి ఈభూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపక్రమించలేదు. ఇప్పుడు సాగవుతున్నది కూడా కేవలం వర్షాలపై ఆధారపడి ఉంది. చేతికి వచ్చే దశలో వర్షాలు కురియక పోతే అంతే సంగతులు. మొత్తం మీద ఉత్తరతెలంగాణలో సేద్యం ఇక సావుకొచ్చినట్టే.
మరింత సమాచారం తెలుసుకోండి: