ఒకటిని తప్పించుకోవడానికే ఆపసోపాలు పడుతున్న మంత్రిపార్థసారథికి రెండోది తోడుకావడంతో ఇక ముప్పు తప్పనిసరి అంటున్నారు. ఫెరా నిబందనలు ఉల్లంఘించి ఇడి కేసులో ఇరుక్కున్న మంత్రి పార్థసారథికి మరోముప్పు వచ్చిపడింది. ఇడికేసులో ఒకసారి జరిమాన సమర్పించుకున్న ఆయనకు తాజాగా జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనినుంచి తప్పించుకోవడానికి కోర్టు నెలరోజుల గడువు ఇవ్వగా అదేపనిలో అవస్థలు పడుతున్నారాయన. ఇంతలో ఎన్నికల నియమావలిని ధిక్కరించారన్న మరో చిక్కు మంత్రి మెడకు చుట్టుకుంది. తన నామినేషన్ అఫిడవిట్ లో ఈకేసువిషయాన్ని ప్రస్తవించక దాచిపెట్టారని ఫిర్యాదు అందుకున్న ఎన్నికల కమీషన్ ఆవిషయాన్ని విచారించింది. ఇదినిజమేనని నిర్ధారించింది. ఈనివేదిక అధికారికంగా అందగానే చర్యలు తప్పవని ఎన్నికల సంఘం కమీషనర్ బన్వర్ లాల్ స్పష్టం చేశారు.ఈనివేదిక ఆయన చేతికి రావడం ఒకటి రెండు రోజుల్లో జరిగేఅవకాశం ఉంది. అదే జరిగితే ఇడి శిక్ష కంటే ముందు ఎన్నికల సంఘం విధించే శిక్షను ముందుగా అనుభవించాల్సి రావచ్చు. ఈవ్యవహారంలో ఆయనకు ఆరు నెలల జైలుశిక్ష,జరిమానా విధించవచ్చు. అంటే రెండు నెలల శిక్ష తప్పించుకునే ప్రయత్నంలో మంత్రి మరో ఆరునెలల శిక్ష కొని తెచ్చుకున్నారన్న మాట. ఈశిక్షల మాట ఎలా ఉన్న మంత్రిపదవి ఊడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. నిబందనలను అడ్డంగా పెట్టుకునో, రాజ్యాంగలొసుగులను ఆధారం చేసుకునో పదవిని అట్లే ఉంచుకునే ప్రయత్నాలు ఆయన చేసినా పలితం కన్పించేలా లేదు. ఒకవేల ఉన్నా నైతికత అడ్డువస్తుంది. పదవికోసం నైతికతను ఆయన తోసిపుచ్చినా పార్టి అధిష్టానం ఒక్కని కోసం పరువు పోగొట్టుకునే పనిచేయలేక ఆయన పదవిని ఊడగొట్టే అవకాశాలున్నాయి.అంటే కేసుల్లో ఇరుక్కుని పదవిని కోల్పోయిన మంత్రి మోపిదేవి జాబితాలోకి పార్థసారథి చేరనున్నారన్న మాట.
మరింత సమాచారం తెలుసుకోండి: