కమల్ హాసన్, ఖుష్బూ, రాధిక, అరవింద్ స్వామి షాకింగ్ కామెంట్స్ ..!?

Chakravarthi Kalyan
దాదాపు 30 ఏళ్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష జరిగింది. డీఎంకే ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, అల్లరితో సభ గందరగోళంగా మారిపోయింది. సినిమాను తలపించే డ్రామా అనంతరం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి విజయం సాధించారు. 122 మంది సభ్యుల మద్దతుతో ఆయన మెజారిటీ నిరూపించుకున్నారు.


డీఎంకే సభ్యుల ప్రవర్తన మరీ అతిగా ఉంది. మైక్‌లు, బల్లాలు విరిచేశారు. స్పీకర్‌ను నెట్టేసి ఆయన స్థానంలో కూర్చున్నారు. ఈ మొత్తం పరిణామాలపై సినీ స్టార్స్ తీవ్రంగా స్పందించారు. ఐతే.. వారు అసెంబ్లీ జరిగిన తీరుపై కాకుండా పళనిస్వామి ముఖ్యమంత్రిగా బలం నిరూపించుకోవడాన్నే సహించలేకపోతూ కామెంట్స్ పెట్టడం విశేషం. 


కమల్‌ హాసన్‌ స్పందిస్తూ.. మరో కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టే కనిపిస్తోంది. జై డె'మాక్‌'క్రేజీ అంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది అంటూ ట్వీట్‌ చేశారు. గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు తమిళనాడు ప్రజలు సరైనరీతిలో స్వాగతం పలుకుతారని కమల్ వార్నింగ్ ఇచ్చారు. స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే బలం, ప్రతిపక్ష సభ్యులు లేకుండా బలపరీక్ష నిర్వహించడమంటే ప్రజాస్వమ్యానికి అది విరుద్ధమేనని సినీ నటి, రాజకీయ నేత ఖుష్బూ కామెంట్ చేసింది. 


తమిళనాట ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్‌ చర్య తీసుకోవాలని మరో సినీ నటి రాధిక కోరారు. మరో నటుడు అరవింద్ స్వామి కూడా పళనిస్వామి ఎంపికను తప్పుబట్టారు. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ బలపరీక్షను ఎవరూ అంగీకరించబోరన్నారు. ఎమ్మెల్యేలు కలువాల్సింది ప్రజలను కానీ, రిసార్టులో పార్టీ నేతలను కాదని సెటైర్ వేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: