కలకలం సృష్టిస్తున్న వై.ఎస్. జగన్ ముద్దు ఫోటో..!?

Chakravarthi Kalyan
ప్రజలను పరామర్శించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్.. ఏపీ సీఎం చంద్రబాబు జనాన్ని చూసుకుంటూ వీ గుర్తు చూపుతూ ముందుకెళ్లిపోతే.. వైఎస్సార్.. చెల్లమ్మా.. అక్కయ్యా.. తాతయ్యా.. అందరికీ నమస్కారం అంటూ ముందుకుసాగేవారు. ఇక వైఎస్ కుమారుడు జగన్ రూటే సెపరేటు.. ఆయన ప్రజలను చాలా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటారు. 


ప్రజలను దగ్గరకు తీసుకుని చెంపలు తడమడం, తలపై ముద్దు పెట్టడం.. జగన్ స్టైల్.. మొదట్లో ఓదార్పు యాత్రలకు ఎక్కువగా వెళ్లడం వల్ల ఈ స్టైల్ జగన్ కు అలవాటైంది. చివరకు కామెడీ స్కిట్లలో సైతం జగన్ ఓదార్పు స్టయిల్స్ ప్రదర్శించే స్థాయికి వెళ్లింది. ఐతే.. అలాంటి ఓ పరామర్సలో జగన్ కు ఇటీవల ఓ షాక్ తగిలింది. 


ప్రజలను దగ్గరగా తీసుకుని పరామర్శిస్తున్న సమయంలో ఓ ముసలమ్మ జగన్ కు చాలా దగ్గరగా వెళ్లింది. పాపం.. మరి జగన్ లో ఆమెకు తన కొడుకే కనిపించాడో.. మనవడే కనిపంచాడో గానీ.. ఒక్కసారిగా జగన్ పైకి లంఘించి గట్టిగా ముద్దు పెట్టేసుకుంది.. ఐతే.. ఆ ముద్దు సాధారణంగా బుగ్గపై పెట్టి ఉంటే చూసేందుకు బావుండేది. ఆ ముసలమ్మ గురి తప్పిందో.. లేక కావాలనే పెట్టిందో కానీ.. అదాటున జగన్ పెదాలపై ముద్దిచ్సేసింది. 


ఇప్పుడు ఈ ఫోటో.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జగన్ పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డులు పాపం ఆమెను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముసలామె ఆప్యాయంగానే ముద్దిచ్చినా అది కాస్తా మిస్ ప్లేస్ కావడంతో చూసేందుకు కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఈ ఫోటోను తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సెటైర్లు పేలుస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: