సీఎం ఛాంబర్ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా

 హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు సచివాలయంలోని సీఎం ఛాంబర్ ఎదుట ఆకస్మిక ధర్నాకు దిగారు. ఫీజు రీయింబర్స్ మెంటును అర్హులైన విద్యార్థులందరీకీ అమలయ్యే విధంగా చూడాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ ఎమ్మెల్యేలు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఫీజు రీయింబర్స్ మెంటును వెంటనే అమలు చేయాలనీ ఆ వినతి పత్రంలో డిమాండు చేశారు. లేఖను అందజేసిన అనంతరం ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా సీఎం ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. నేలపై కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంటులో ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరును టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప బట్టారు. ఫీజు రీయింబర్స్ మెంటుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేదాకా తాము ఇక్కడి నుంచి కదలబోమనీ వారు భీష్మించుకుని కూర్చున్నారు. సీఎస్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నాకు దిగడంతో పోలీసులు కంగుతిన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన ధర్నాను విరమింపచేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.అయితే,టీడీపీ ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: