మూడు ముళ్ల బంధం:మనసు ఒకరికి...మనువు మరకరితో

 హైదరాబాద్: మనది హిందూ దేశం. మనకంటు కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలున్నాయి. అంతేకాదు,ప్రపంచంలోనే మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశమన్నా, మన సాంప్రదాయాలన్నా ఇతర దేశాల వారు ఎంతో గౌరవిస్తారు. మన ఆచార, వ్యవహారాలను, సాంప్రదాయాలను వారు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా మన వివాహా సాంప్రదాయలకు ఇతర దేశాల్లో ఎంతో ప్రాధాన్యత వుంది. ఈ మూడు ముళ్ల బంధానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్రనే వుంది. మన వివాహా సాంప్రదాయం ఇతర దేశాల వాళ్లు ఆసరిస్తున్న వేళ...మన దేశం, మన రాష్ర్టం విషయానికి వచ్చే సరికి కొంత నవ్వులపాలవుతోంది. అభాసుపాలవుతోంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన మూడు ముళ్ల బంధానికి మచ్చ తెచ్చే విధంగా నేటి యువత వ్యవహారిస్తోంది. ప్రపంచమే మన సాంప్రదాయాల పట్ల మొగ్గు చూపుతున్న వేళ...మన యువతీ, యువకులు మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా చేస్తున్నారు.  ముఖ్యంగా చదువుకున్న వారు, ఉద్యోగాలను వెలగబెడుతున్న వారే మన సాంప్రదాయాలను, కట్టుబాట్లను మంటగలుపుతున్నారు. ఇవీ ఎక్కువగా సాఫ్ట్ వేర్ రంగంతో పాటు, మరికొన్ని రంగాల్లో పని చేస్తున్న వారు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. మూడు ముళ్ల బంధానికి తూట్లు పొడుస్తున్నారు. పెళ్లిళ్లు పెటాకులు చేస్తున్నారు. కన్నవాళ్లకు క‘న్నీళ్లు’ మిగిలిస్తున్నారు. మానసిక సంఘర్షణకు లోనై తనువు చాలిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నీలిమ ఉదంతం. వైవాహిక జీవితంపై తీవ్ర అసంత్రుప్తికి గురైన నీలిమ చివరకు తనవు చాలించింది. నిండు నూరేళ్లు జీవితాన్ని కొనసాగించాల్సిన నీలిమ దాంట్లో పావుల వంతు జీవితంతో సరిపెట్టుకుంది. నీలిమ ఉన్నత చదువులు చదివింది. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విదేశాలకు వెళ్లి వచ్చింది. అయితే, నీలిమ తనువు చాలించిన తీరు, ఆమె తన భర్తకు, ఇతరులకు పంపిన ఫోన్ మెస్సెజ్ లను చూస్తే మనసు ఒకరిపై, మనువు మాత్రం మరొకరితో జరిగిందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండేళ్ల కింద సుధాకర్ రెడ్డిని ఆమె పెళ్లి చేసుకుంది. పదేళ్లకు పైగా ప్రశాంత్ అలియాస్ పండుతో పరిచయం వుంది. ఇది మనం చెప్పడం లేదు, ఆమె తన మెస్సెజ్ ల ద్వారా వెల్లడించింది. కాలేజీ నుంచి పరిచయమో? స్నేహమో? ప్రేమనో? తెలియదు కానీ, వారిద్దరి మధ్యన మంచి సంబంధాలున్నాయనీ మాత్రం స్పష్టం. అలాంటి నీలిమ రెండేళ్ల కిందట మరో వ్యక్తిని పెళ్లాడింది. పెళ్లయినప్పటి నుంచి నీలిమ-సుధాకర్ ల కాపురం ఏనాడు సవ్యంగా సాగినట్లు లేదు. నీలిమ తన సెల్ ఫోన్ ద్వారా పంపిన మెస్సెజ్ లు ఆసక్తికరంగా ఉన్నాయి. నీ దారి (భర్త) వేరు, నా దారి వేరు, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నీ ఆలోచనలకు నా ఆలోచనలు సరిపోవు అంటూ మెస్సెజ్ పెట్టిన తీరును చూస్తేనే ఆమె ఇష్టపడి సుధాకర్ను పెళ్లాడలేదనీ అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.  నీలిమ పంపిన మెస్సెజ్ లో మరో ముఖ్యమనీ విషయం ‘స్వేచ్ఛ’, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోమనీ, మన ఇద్దరికీ సెట్ అవ్వదనీ, ప్రశాంత్ స్నేహం. దీనితోనే అర్థమవుతోంది నీలిమ మనసంతా మరొకరిపై వుందనీ, పెద్దల ఒత్తిళ్లో మరేమైనా కారణమో మొత్తానికి తెలియదు కానీ, సుధాకర్ను పెళ్లాడింది. పెళ్లయితే చేసుకుంది కానీ కాపురం చేయడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదనీ తెలుస్తోంది. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్న నీలిమ ముందే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదనీ చెప్పి ఉంటే ఈనాడు ఆమె తల్లికి శోకం మిగిలేదు కాదు. సుధాకర్ జీవితం దుర్భరమయ్యేది కాదు. ప్రశాంత్ స్నేహం గురించి అనుమానాలు వచ్చేవి కావు. అన్నింటికంటే ముఖ్యంగా నీలిమ తనువు చాలించేది కాదు. తనకు ఒకరిపై ప్రేమ ఉన్నప్పుడు మరొకర్ని మనువు ఆడటం చాలా తప్పు. దీని వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడతాయి. ముఖ్యంగా మూడుముళ్ల బంధానికి విలువ లేకుండా పోతది. నిజంగానే ఎవర్నయినా ప్రేమించినప్పుడు ధైర్యంగా ఇంట్లో వారికి చెప్పాలి. ఉద్యోగం చేస్తూ తమ కాళ్ల మీద నిలబడిన స్థాయికి వచ్చినప్పుడు తను ఒకర్ని ప్రేమించాను. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదనీ తల్లిదండ్రులకు చెప్పాలి. ఒప్పించాలి.  అంతే కానీ, ఒకరితో ప్రేమాయణాలు నడిపి...మరొకర్ని పెళ్లి చేసుకుంటానడం అందరికీ నష్టమే. ఇది ఒక నీలిమ విషయమే కాదు. చాలా మంది జీవితాలు నలిగిపోతున్నాయి. ఇలాగే మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా ఈనాటి యువతీ, యువకులు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోని హాయిగా జీవితాన్ని సాగించాలే తప్ప కన్నవారిని, కట్టుకున్న వారిని ఏడ్పించడం ఎంత మాత్రం తగదు. ఇది ఎవర్నో నొప్పించడానికి చెప్పడం కాదు. నిండు నూరేళ్లు పిల్లా, పాపలతో నవ్వుతూ గడపాల్సిన జీవితాన్ని మధ్యలోనే తుంచి వేసుకోవద్దనీ చెప్పడమే మా ఉద్దేశం. అయితే, ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. ఈ దేశ భవిష్యత్, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు నేటి యువతీ, యువకులపైన ఆధారపడి ఉన్నాయి. ఆ దిశగా యువత అడుగులు వేయాలే తప్ప నీలిమ మాదిరిగా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరో విధంగా చేయడం చాలా తప్పు. కన్నవారిని, కట్టుకున్న వారిని, మన కట్టుబాట్లను కాపాడాల్సిన బాధ్యత యువత. ఇప్పటికైనా యువత ఆలోచన, వ్యవహారశైలిలో మార్పులు రావాలనీ కోరుకుందాం! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: