సర్కారు తప్పు సావుకొచ్చింది : ‘మహా‘ ఎఫెక్ట్

మన రాష్ట్ర సర్కారు చేసిన తప్పు రైతుల సావుకొచ్చింది. మహారాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కూడా కాదని, వారి రైతుల ప్రయోజనాల కోసం కేంధ్రజలసంఘం అనుమతులను కూడా అతిక్రమించి గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ సహా మరో 12 ప్రాజెక్టుల కారణంగా ఇప్పుడు వర్షాలు పడ్డాకూడా తెలంగాణలోని అయిదు జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చుక్కనీరు రావడం లేదు. శ్రీరాంసార్ ఎగువున గోదావరిపై నాందేడ్ జిల్లా బాబ్లీ వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణం అక్రమమని టిడీపి,టిఆర్ఎస్ లు ఆందోలను దిగడం, అనుమతికి భిన్నంగా ప్రాజెక్టు డిజైన్ ఉందని పరిశీలన కోసం చంద్రబాబునాయుడు సహా టీడీపి నేతలు వెల్లారు. వీరిని ఆదిలాబాద్ జిల్లా భైంసా సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో అడ్డుకుని అడ్డగోలుగా లాఠీలతో బాదారు. పొరుగురాష్ట్రపు ప్రతిపక్షనేతగా,మాజిముఖ్యమంత్రిగా కూడా చూడకుండా అరెస్టు చేసి మూడురోజులు నిర్బందంలో ఉంచితే కూడా మనప్రభుత్వం కిమ్మనలేదు. అంతెందుకు కాంగ్రేస్ పార్టీకే చెందిన నిజామాబాద్ ఎంపి మదుయాష్కి గౌడ్ బాబ్లీ నిర్మాణం ఆపాలంటూ కోర్టును ఆశ్రయించే వరకు కూడా పట్టించుకోలేదు మన సర్కారు. ఆతర్వాత తెలంగాణలో రైతాంగం ఆందోలనలు పెద్దఎత్తున మొదలుకావడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసువేసి చేతులు దులుపుకుంది. మహారాష్ట్ర మాత్రం వారి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని నిర్మాణ పనులు నిలిపివేయాలని కేంద్రం ఆదేశించినా కూడా అక్కడికి ఎవరిని రానీయకుండా పోలీసు బందోబస్తు పెట్టి పనులు పూర్తి చేసింది.పలితం ఈ ఏడాది మనరైతుల నోట మట్టి కొడుతోంది. ఒకటికాదు,రెండు కాదు కరీంనగర్,వరంగల్,నిజామాబాద్,ఆదిలాబాద్,నల్గొండ జిల్లాల్లోని దాదాపు 18లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు ఎస్సారెస్పీ లోకి నీళ్లు రాకుండా పోయాయి. మహారాష్ట్ర వరదలతో అతలాకుతలమై వారు వరదగేట్లు తెరిస్తే తప్ప మన ప్రాజెక్టుకు చుక్కనీరు రాదు. గడచిన పదిరోజులుగా మహారాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా కూడా ఎస్సరెస్పీ నీటిమట్టం 1058 అడుగులకు చేరుకోలేదు. దీని అసలు నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం ఉన్న నీటి మట్టం నాలుగు జిల్లాల తాగునీటి అవసరాలను మాత్రమే తీర్చగలదు. గత సంవత్సరం ఈసమయానికి పూర్తిగా నిండగా శ్రీరాంసాగర్ వరదగేట్లు తెరచి నీటిని గోదావరిలోకి వదిలారు. ఈపరిస్థితిని ముందే ఊహించిన ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు సగం సాగును కూడామొదలు పెట్టలేదు. ఈ ఆయకట్టంతా అందరి ఆకలి తీర్చి కర్షకుని ఇంట కనకవర్షం కురిపించే వరి పొలాలే. తెలంగాణ లో పత్తి తర్వాత అధికంగా పండించేది ఈపంటనే. ఇప్పటికే పత్తి పండక ప్రతిఏటా పత్తిరైతుల ఆత్మహత్యలతో ఈప్రాంత అల్లల్లాడుతోనే ఉంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలో పంట పండే అవకాశమే లేదన్న దిగులుతో ఇద్దరు పిల్లలకు,భార్యకు విషాహారం తినిపించి తాను తినడంతో మొత్తం కుటుంబమే ప్రాణాలు తీసుకుంది. ఇప్పుడు చేసిన సర్కారు తప్పుకు పత్తిరైతులకు తోడు వరి రైతుల ఆత్మహత్యలు కూడా మొదలు కాక ముందు మన రాష్ట్రప్రభుత్వం కళ్లు తెరవాలి, లేదంటే కళ్లు తేలేసే పరిస్థితులు వస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: