కిరణ్ వల్ల కాంగ్రెస్కు నష్టమట

 హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కిరణ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందనీ,తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఎంపీలు ఢిల్లీలో పార్టీ రాష్ర్ట వ్యవహరాల ఇంఛార్జి గులాంనబీ ఆజాద్ ను కలిసి సీఎంకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. సిరిసిల్లలో విజయమ్మ తలపెట్టిన చేనేతన్న కార్మికుల దీక్ష విజయవంతమయ్యే విధంగా సీఎం కిరణ్ సహకరించాడనీ సదరు ఎంపీలు ఆజాద్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విజయమ్మ పర్యటనకు వేలాది మంది పోలీసులతో భద్రతను కలిపించడంపై మీడియాలో వచ్చిన కథనాలను, వీడియో క్లిప్పింగ్ లు కూడాను అందచేసినట్లు సమాచారం.  ముఖ్యమంత్రి కిరణ్ తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ బలపడే విధంగా చేశారనీ ఆజాద్కు వివరించినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డిలకు బంధుత్వం ఉన్న విషయం కూడా ఆజాద్ కు చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు సకల జనుల సందర్భంగా ఆందోళనలో పాల్గొంటే కేసులు పెట్టించిన కిరణ్ వైఎస్ఆర్ సీపీపై అనుకూలంగా వ్యవహారించడం పట్ల తెలంగాణ ఎంపీలు అసంత్రుప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందనీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిరిసిల్లలో విజయమ్మ పర్యటన విజయవంతం అయ్యే విధంగా సీఎం చేశాడనీ, పోలీసుల ఓవరాక్షన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారనీ, ఇది తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందంటూ ఆజాద్ కు ఫిర్యాదు చేశారనీ సమాచారం. సీఎం కిరణ్ తీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే విధంగా వుందనీ, పోలవరం టెండర్లలో టీడీపీ పార్టీకి చెందిన కాంట్రాక్టర్కు అనుకూలంగా వ్యవహారించాడనీ కూడా ఎంపీలు ఫిర్యాదు చేశారు.  సీఎం కిరణ్ పై టీ ఎంపీలు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో అనేకమార్లు ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల తరువాత ఎంపీలంతా మరోమారు సీఎంపై ఫిర్యాదు చేయడం మొదటిసారి. ఇదిలా ఉంటే, సిరిసిల్లలో విజయమ్మ పర్యటించడం టీఆర్ఎస్ ఉనికికి కొంత ప్రమాదకరమనీ చెప్పొచ్చు. విజయమ్మ వస్తే టీఆర్ఎస్ గొడవ చేయడంలో ఎంతో కొంత న్యాయం వుంది. కాంగ్రెస్ టీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో వారికే అర్థం కావాలి. సీఎం వల్ల కాంగ్రెస్ నష్టపోతుందంటున్న టీ కాంగ్రెస్ ఎంపీల వల్ల తెలంగాణలో పార్టీకి ఓనగూరిందేమిటో వారే చెప్పాలి. టీకాంగ్రెస్ ఎంపీల తీరు టీఆర్ఎస్కు లాభం చేకూరుతుందే తప్ప కాంగ్రెస్కు ఎలాంటి లాభం లేదనీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అంటున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపారనీ సాక్షాత్తు మంత్రి డికే.అరుణ సీఎంకు, పీసీసీకి ఫిర్యాదు చేసిన విషయం విధితమే. అటువంటి ఎంపీలు సీఎం కిరణ్ వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందనీ ఫిర్యాదు చేయడం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా’ వుందనీ కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కవగా. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: