విజయమ్మకు నిరసనలు, స్వాగతాలు

 హైదరాబాద్: సిరిసిల్లలో నేతన్న ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైఎస్ విజయమ్మకు టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి నిరసనలు ఎదురు కాగా, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలు దేరిన విజయమ్మకు నగరంలోని అల్వాల్, బొల్లారం, రంగారెడ్డి జిల్లా హకీంపేట, తూంకుంట తదితర ప్రాంతాల్లో నిరసనలు ఎదురయ్యాయి. అంతకంటే ఎక్కువగా ఆమెకు ప్రజల నుంచి స్వాగతం లభించింది. శామీర్ పేట, ములుగు, వంటిమామిడి, ప్రజ్నాపూర్ తదితర గ్రామాల్లో ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మెదక్ జిల్లాకు ప్రవేశించినప్పటి నుంచి విజయమ్మకు కలుసుకోవడానికి ప్రజలు తండోపతండలుగా తరలివచ్చారు. తనను చూసేందుకు వచ్చిన వారందరికీ విజయమ్మ అభివాదం తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: