హైదరాబాద్: మొన్నటి వరకు ఆయన ప్రపంచంలోని ఓ మతానికి చెందిన లక్షలాది మంది ప్రజలకు మతబోధకుడు. ఆరాధ్యదైవం. ఆయన వస్తానంటే పలు దేశాలధ్యక్షులు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికేవారు. ఆయనతో కరాచలనం చేసేందుకు ఎంతో మంది ప్రముఖులు ఎగబడేవారు. ఆయన ఉపన్యాసాలకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆయన ఓ నిందుతుడు. కాదు, కాదు ఓ పిచ్చోడు. చదువుకున్నది 10వ తరగతి కావచ్చు. ఆయన ఉపన్యాసాలతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆయన తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. కానీ, విధి వక్రీకరించింది. దేవుడు కరుణించలేదు. ఆయనకు ప్రత్యేక బోయింగ్ విమానం. ఇప్పుడు ఆయన ఎర్రగడ్డ ఆసుపత్రిలోని పిచ్చాసుపత్రిలో చేరారు. ఆయనే....కేఏ పాల్. చదువుకున్నది 10వ తరగతి అయినప్పటికీ ఆయన మత బోధనలతో ప్రపంచంలో మాత్రం డాక్టర్ పాల్ గా పేరు తెచ్చుకున్నారు. ఒకనాడు పాల్ ప్రసంగాలతో లక్షలాది మంది ప్రజల్రి ఆకర్షుతుల్ని చేసుకోవడమే కాకుండా, ఆయన దర్శనభాగ్యం కోసం క్యూలో నిలుచున్న వాళ్లు ఎంతో మంది. ఇప్పుడు మాత్రం ఆయన ఏకాకిగా మారారు. పిచ్చోడిగా ముద్రపడ్డాడు. రాజకీయంగా, మతబోధకుడుగా ఎదుగుతన్నాడనో, పోలీసులు చెబుతున్నట్లుగా హత్య కేసులో ఇరుక్కున్నాడో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం ఆయన నగరంలోని ఎర్రగడ్డలోని పిచ్చి ఆసుపత్రిలో పిచ్చోడిగా చికిత్సను పొందుతున్నాడు. ఒకప్పుడు తనకోసం ప్రపంచంలోని పలు దేశాలధ్యక్షులు తనను కలుసుకోవడం కోసం క్యూలో నిలిచే వారనీ, తన వల్లనే అనేక దేశాలధ్యక్షులయ్యారనీ, అనేక దేశాల్లో శాంతిభద్రతలు నెలకొన్నయాని చెప్పుకునే డాక్టర్ పాల్ ఇప్పుడు పిచ్చోడు అని వైద్యుల అంటున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం ఎర్రగడ్డలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పిచ్చోడిగా పాల్ ను ఆసుపత్రిలో చేర్పించడానికి... రెండుమూడు ఏళ్ల కిందట మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన తన సోదరుడు హత్య జరిగింది. ఆ హత్య కేసు అప్పట్లో మిస్టరీగా మారింది. అప్పట్లో పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేశారు. అప్పుడు పాల్ హస్తంపై అనుమానం వచ్చింది. అప్పటి నుంచి పాల్ కొంత సైలంట్టుగా ఉన్నారు. గత నెల కిందట రాష్ర్టంలో జరిగిన ఉప ఎన్నికల్లో పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ తరుపున పలు నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. అభ్యర్థులను నిలబెట్టారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగానే పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన హత్య కేసుతో పాల్ కు సంబంధం ఉందనేదీ ఆ కేసు సారాంశం. పోలీసుల అరెస్టుతో పాల్ ను జ్యుడీషియల్ కస్టడీకి విధించారు. కస్టడీలో పాల్ కు పోలీసులు చుక్కల్ని చూపించారు. జైలులో ఉన్న పాల్ ను ఆరోగ్యం బాగులేదనీ ప్రకాశం నుంచి ఒంగోలుకు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. తాజాగా ఆయనను నగరంలోని ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రికి తరలించారు. పాల్ మెంటల్ సరిగ్గా లేదనీ, దానితోనే ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించినట్లు చెబుతుండగా, పాల్ మాత్రం దానిని కొట్టేస్తున్నారు. రాజకీయంగానే తనను ఈ కేసులో ఇరికించారనీ, తనకెలాంటి పిచ్చి లేదంటున్నారు. మొత్తానికి ఒకనాడు ప్రపంచ వ్యాప్తంగా తన ప్రసంగాలతో ఆకట్టుకున్న పాల్ ఇప్పుడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. తన ఆశీస్సులు, బోధనల ద్వారా ఎందర్నో మార్చాననీ చెప్పుకున్న పాల్ కు ఇప్పుడు వచ్చిన కష్టం ఎవరు తీరుస్తారో. పాపం పాల్.
మరింత సమాచారం తెలుసుకోండి: