త్వరలోనే నీటి సంఘాలకు ఎన్నికలు

Kuthuru Raji Reddy
సహకార సంఘాల ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే దూకుడుగా వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగానే నీటివినియోగదారుల సంఘాలకు ఎన్నికలను త్వరలోనే నిర్వహించేందుకు ప్రభత్వం రంగం సిద్దంచేసింది. నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు ఆమోదముద్ర వేసినటువంటి సిఎం ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులకు సిద్దం చేయనున్నారు. నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు 2008సంవత్సరంలో జరిగాయి. ఈ ఎన్నికైన వారిలో మూడో వంతు సభ్యులు 2010 జనవరిలో, మరో మూడోవంతు సభ్యులది 2012లో పదవికాలం ముగిసింది. దీంతో ఎన్నికలు జరుపాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నీటివినియోగదారుల సంఘాలకు ఇదే నెలలో నోటీఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మినహాయించి అన్ని జిల్లాలో ఉన్నటువంటి నీటిసంఘాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా చేయి జారిపోకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఎటువంటి ప్రాధాన్యతలేని నీటివినియోగదారుల సంఘాలకు ఇంతగా ఆర్భాటం చేయడం రాజకీయంగా లబ్ధిపొందడం మినహాయించి ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రోటో కాల్ లేనటువంటి సహకార సంఘాల్లోనే కోట్లాది రూపాయలు ఖర్చుకాగా నీటివినియోగదారుల సంఘాల ఎన్నికల్లో కూడా డబ్బులు, మద్యం ప్రభావం ఉండే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: