చెరగని “ ముద్ర ‘’

Kuthuru RajiReddy
రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాల ముద్రను చెరిపేయాలని భావిస్తున్న అథికార పార్టీ ఈ విషయంలో తర్జన భర్జన అవుతుంది. వైఎస్ఆర్ రాష్ట్రముఖ్యమంత్రిగా అధికారం చెపట్టిన నుండి వివిధ సంక్షేమ ప్రవేశపెట్టారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే అనేక సంక్షేమ పధకాలు అమలు కావడంతో కేవలం పథకాలన్ని వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలుగానే ప్రజలు బావించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సంక్షేమ పథకాల ఘనత వైఎస్ఆర్ ఘనతగానే చెప్పుకొచ్చారు. దీంతో పాటు ప్రభుత్వంలో వైఎస్ఆర్ వన్ మెన్ షోగా నే నడిచారు. రెండవసారి అధికారంలోకి రావడానికి ముందు సైతం పార్టీ గెల్చిన, ఓడిన తానే బాధ్యుడనని భరోసగా చెప్పారు. అదే విధంగా రెండవసారి కేవలం వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతోనే అధికారంలోకి వచ్చిందని మెజార్టీ ప్రజలు బావించారు. దీంతో వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజల్లో మరింత ముద్రవేసుకున్నారు. ఆతర్వాత వైఎస్ఆర్ దుర్మరణం పాలు కావడంతో అప్పటి నుండి జరిగిన పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారు. కాగా సీమాంద్రలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ అంటే మెజార్టీ ప్రజలకు అభిమానం. అందుకే వైఎస్ఆర్ మరణాన్ని భరించలేని అభిమానులు తెలంగాణలోని గ్రామాలతో పాటుగా మిగతా ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు సంతాప దినాలు జరుపుకోవడంతో పాటుగా కొంత మంది వైఎస్ఆర్ అభిమానులు బెంగతో, గుండెపోట్లతో చనిపోయారు. ఈసమయంలోనే వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్ర విజయవంతం కావడంతో మరింత ముందుకెళ్లడానికి తోడ్పడింది. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వైపు కొంతమంది వెళ్లడం, ఉప ఎన్నికలు జరుగడం, వైఎస్ఆర్ సిపి విజయం సాధించడంతో ప్రజల్లో వైఎస్ఆర్ పై ఉన్నటువంటి అభిమానం స్పష్టమైంది. సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ చేపట్టిన పథకాలుగా ముద్రపడడంతో స్పందించిన ప్రభుత్వం అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలుగా ప్రచారం చేసుకొని, దివంగత వైఎస్ఆర్ పై పడిన సంక్షేమ ముద్రను చెరిపేయడం కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇటువంటి సమయంలో సంక్షేమ, అభివృద్ది పథకాలతో వైఎస్ఆర్ కు ఎటువంటి సంబంధం లేదని, ఇవన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అధికారపార్టీ నాయకులు ఈ సమయంలో చెబితే ప్రజలు దీన్ని ఎలా అర్ధం చేసుకుంటారో కాలమే నిర్ణయిస్తుంది. ప్రభుత్వపథకాల పేర్లు మారిస్తే ప్రజలు స్వాగతిస్తారా లేదా ఇది ప్రభుత్వ కుట్రగా బావిస్తరా అనేది రానున్న ఎన్నికల సమయంలో ఓటర్లు తేల్చి చెప్పనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: