మళ్లీ సింగరేణిలో ఉద్యోగాల జాతర.. నిరుద్యోగులకు శుభవార్త

Chakravarthi Kalyan
తెలంగాణలో మరో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. దాదాపు 240 కుపైగా ఉద్యోగాల కోసం సింగరేణి సంస్థ త్వరలోనే నోటిఫికేషన్ వేయబోతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే సింగరేణి సంస్థ ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన సంగతి తెలిసిందే.

తాజాగా సింగరేణి మరో నోటిఫికేషన్ కు సిద్ధమవుతోంది.  మరో 242 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో లాగానే ఇంటర్వూలు లేకుండా రాతపరీక్ష ద్వారానే ఉద్యోగాలను భ ర్తీ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.


సింగరేణి నోటిఫికేషన్ ఇవ్వనున్న 242 ఖాళీల వివరాలు ఇవీ.. మేనేజ్‌మెంట్ ట్రైనీ పైనాన్స్ అండ్  అక్కౌంట్స్ లో 10, జూనియర్ అటవీ అధికారులు- 4, జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌లు- 163,  వెల్డర్ ట్రైనీ పోస్టులు- 46, ఫార్మాసిస్టులు- 7 పోస్టులు, జూనియర్ టెక్నిషియన్ పోస్టులు - 4, ఫిజియో థెరపిస్టు పోస్టులు- 4, జూనియర్‌ ఫారెస్టు అసిస్టేంట్  పోస్టులు- నాలుగింటికి... నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుంది.

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఆధారంగా ఇచ్చేస్తారు. రాత పరీక్ష రాసిన రోజే ఫలితాలను ప్రకటిస్తారు. తెలంగాణ వచ్చాక సింగరేణి  2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసింది. 22001 మందికి ఉద్యోగాలిచ్చింది. ఇవి కాకుండా సంస్థలో  ఇప్పటికే పని చేస్తోన్న ఉద్యోగులకు వేయి మందిని పర్మినెంట్ చేసింది. డిపెండెంట్  ఉద్యోగ విభాగంలో 2000 మందికి ఉద్యోగాలు కల్పించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: