మీరు బ్లూ ఫిల్మ్ లో నటించారా..? లేదా..? రోజాకు టీవీ9 సూటి ప్రశ్న..!

Chakravarthi Kalyan
వివాదాస్పదమై అంశాలను లేవనెత్తడంలోనూ.. వాటి నుంచి రేటింగులు రాబట్టుకోవడంలోనూ టీవీ9 ను మించిన ఛానల్ తెలుగులో లేదు. ఎక్కడ పబ్లిక్ ఇంట్రస్ట్ ఉంటుందో.. ఆయా అంశాలను వెదికి పట్టుకుని మరీ వాటిని ఆసక్తికరంగా చూపుతుంది టీవీ9. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకనే తెలుగులో ఎన్ని కొత్త ఛానళ్లు వచ్చినా టీవీ 9 ఫస్ట్ ప్లేస్ మాత్రం దాదాపుగా అలాగే ఉంది. 

అయితే టీవీ9 కు ప్రేక్షకాదరణ బాగా ఉండటం ఎంత వాస్తవమో.. అబ్బో వీళ్లు చేసే ఓవరాక్షన్ చూడలేక పోతున్నాం అనుకునేవాళ్లూ అదే రేంజ్ లో ఉన్నారు. ప్రత్యేకించి కొందరు యాంకర్లు కాంట్రావర్సీ ప్రశ్నలతో సెలబ్రెటీలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. అలాంటి వారిలో జాఫర్ ఒకరు. ఈయన నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమం ఆసక్తికరంగా ఉంటోంది. 

తన ప్రశ్నలతో నేతలను ఉక్కిరిబిక్కిరి చేసే జాఫర్ రీసెంటుగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అనితతో అసెంబ్లీలో వచ్చిన తగువు.. అది సస్పెన్షన్ కు దారి తీయడం, హైకోర్టు తీర్పులు ఇలా అన్ని అంశాలను స్పృశించారు. కానీ జర్నలిస్టుగా జాఫర్ ఓ సున్నితమైన లైన్ దాటారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రోజా.. నిజంగా మీరు బ్లూ ఫిల్మ్ లో నటించారా.. అని నేరుగా ఓ మహిళా ఎమ్మెల్యేను ప్రశ్నించడం వివాదాస్పదమైంది. అంతే కాకుండా ఆ కార్యక్రమం ప్రోమోలో ఆ ప్రశ్నను  ఉంచి చూడండి మా ఇంటర్వ్యూ అని ప్రచారం చేసుకోవడం కలకలం రేపింది. టీవీ9 తీరుపై, అలాంటి ప్రశ్నలు అడిగినా స్పందించిన రోజా తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. 

సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ చూసిన టీవీ9 సిబ్బంది.. ఇదేదో కాంట్రావర్సీ అయ్యేలా ఉందనుకున్నారో ఏమో ప్రోమోను మాత్రం మార్చారు.. పాత ప్రోమోను ఇంటర్ నెట్ నుంచి కూడా తొలగించారు. ఈ ఇంటర్వ్యూ ఈ ఆదివారం రాత్రి ఏడున్నరకు ప్రసారం కావాల్సి ఉంది. మరి  మీరు బ్లూ ఫిల్మ్ లో నటించిన మాట వాస్తవమా కాదా.. అన్న జాఫర్ ప్రశ్న, రోజా సమాధానాన్ని ఫైనల్ ఔట్ పుట్ లో ఉంచారో లేదో.. టీవీ9 చూస్తే కానీ తెలియదు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: