జగన్ విదేశీ కుట్రను బయట పెట్టిన చంద్రబాబు...!?

Chakravarthi Kalyan
అమరావతిలో రాజధాని నిర్మించడాన్ని వైసీపీ ముందు నుంచీ వ్యతిరేకిస్తూనే ఉంది. అమరావతిలో కాకుండా ప్రకాశం జిల్లా దొనకొండ సమీపంలో రాజధాని నిర్మిస్తే బావుంటుందన్నది వైసీపీ అగ్రనేతల ఆలోచన. జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే అదే జరిగేది. కానీ చంద్రబాబు అధికారంలోకి రావడం వల్ల ఆయన టీడీపీ లాభనష్టాలను బేరీజు వేసుకుని అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసుకున్నారు. 

ఈ పరిణామం సహజంగానే గిట్టని జగన్.. అమరావతి విషయంలో మొదటి నుంచి అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఏపీ సర్కారు అట్టహాసంగా వందల కోట్లు పెట్టి ఖర్చు చేసినా జగన్ అటువైపు కూడా చూడలేదు. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రం మంత్రులతో పంపినా కనీసం తీసుకునేందుకు కూడా ఇష్టపడలేదు. 

అంతవరకూ ఓకే. శంకుస్థాపనకు హాజరుకావడం, కాకపోవడం ఆయన ఇష్టం. కానీ ఈ కార్యక్రమాన్ని సక్సస్ కాకూడదని జగన్ కోరుకున్నారా.. ఆ కార్యక్రమం ఫెయిల్ చేసేందుకు జగన్ ప్రయత్నించారా.. అవునంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమానికి రావాల్సిన విదేశీ ప్రతినిధులను జగన్ రావద్దని కోరారట. ఆయా వీదేశీ కంపెనీలకు, వ్యక్తులకు జగన్ రావద్దని ఈ మెయిల్స్ పంపారట. 

అమరావతి బ్రాండ్‌ ను దెబ్బతీయడానికి జగన్.. అమరావతికి రావద్దంటూ చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాల ప్రతినిధులకు టెలిగ్రామ్‌లు, ఈ-మెయిల్స్ పంపించారట. ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం తన ప్రెస్ మీట్లో ఈ విషయం బయటపెట్టారు. అమరావతిలో తాము ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మించాలని తీవ్రంగా కష్టపడుతుంటే జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నాడని.. ఈ అరాచకాలు సహించబోమని చంద్రబాబు హెచ్చరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: