అలా వ్యభిచారం చేస్తే తప్పు కాదట..!

Chakravarthi Kalyan
చాలా దేశాల్లో వ్యభిచారం ఓ చట్టబద్దమైన వ్యవహారం. కొన్నిదేశాలైతే వ్యభిచారంపై వచ్చే పన్నులే ప్రధాన ఆదాయంగా మనుగడ సాగిస్తున్నాయి. వ్యభిచారిణులను గౌరవప్రదంగా చూసే దేశాలూ ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం వ్యభిచారం ఎలా జరిగినా నేరమే. అందుకు చట్టంలో కొన్ని శిక్షలు కూడా ఉన్నాయి. 

కానీ త్వరలోనే ఈ సీన్ మారబోతోంది. ఇకపై వ్యభిచారం చాలా కేసుల్లో తప్పు కాకపోవచ్చు. ఎందుకంటే.. వ్యభిచారుణులు, వారి హక్కులపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ ఓ కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది. అదేంటంటే.. వ్యభిచారమైనా సరే.. ఇద్దరి మద్య అంగీకారంతో సెక్స్ లో పాల్గొంటే సంబందిత సెక్స్ వర్కర్స్ ను అరెస్టు చేయకూడదట. 

వ్యభిచారిణుల స్థితిగతులను మెరుగుపరచడం కోసం, వారి హక్కులను పరిరక్షించడానికి గాను 2011లో నియమితమైన ఈ కమిటీ ఓ నివేదిక రూపొందించింది. అందులో ఇలాంటి అనేక విషయాలు పొందుపరిచారట. స్వచ్ఛందంగా సెక్స్ లో పాల్గొనడం అక్రమం కాదన్నది ఈ కమిటీ అభిప్రాయం. కాకపోతే.. వ్యభిచార గృహాన్ని నిర్వహించడం మాత్రం అక్రమమే.

త్వరలోనే ఈ కమిటీ నివేదిక ఆధారంగా చట్టంలో మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కమిటీ సిఫార్సులే అమల్లోకి వస్తే.. వ్యభిచార నేరం కింద అరెస్టయ్యే మహిళల సంఖ్య చాలా వరకూ తగ్గిపోతుంది. వ్యభిచారం చేస్తూ దొరికిపోయినా కూడా అది తాము ఇష్టప్రకారం చేస్తున్నామని చెబితే చాలు అరెస్టవకుండా తప్పించుకోవచ్చు. వ్యభిచార గృహాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో వ్యభిచారం చేసేవారికి ఈ నిబంధన లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుందంటున్నారు మరికొందరు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: