హైదరాబాద్: నాలుగు జిల్లాల ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉన్మాది సాంబశివరావు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. సాంబను గొలుసులతో కట్టేసినప్పటికీ పోలీసుల నుంచి తప్పించుకోవడం సంచలనంరేపింది. పోలీసుల నిర్లక్ష్యం మరోమారు బయటపడ్డది. ఎంతోమందిని హతమార్చిన ఉన్మాది సాంబ కోసం ప్రత్యేక పోలీస్ బలగాలు గత కొన్ని నెలలుగా గాలిస్తున్నాయి. ఎట్టకేలకు దొరికిన సాంబ మళ్లీ పారిపోయారు. సాంబ చుట్టూ సీఐ, ఎస్ఐలు, సాయుధ కానిస్టేబుళ్లు ఉన్నారు.
కాళ్లను గొలుసులతో కట్టినప్పటికీ వీటన్నింటి నుంచి తప్పించుకోవడం పూర్తిగా పోలీసుల వైఫల్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా నెలల తరువాత పట్టుబడ్డ సాంబను పోలీసులు విచారించగా క్రిష్ణ జిల్లా కొండపల్లి కొండపై బంగారం దాచిపెట్టినట్లు చెప్పడంతో ఓ సీఐ, ఎస్ఐ, 10మంది కానిస్టేబుళ్లు సాంబను కొండపల్లి కొండ వద్దకు తీసుకెళ్లారు. కొండపైకి తీసుకెళ్లిన సమయంలో గొలుసులతో కాళ్లను కట్టివేశారు కూడా. సాంబను గొలుసులతో పట్టుకున్నకానిస్టేబుల్ను నెట్టివేసి సాంబ లోయలోకి దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎంతోమందిని హత్యచేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా పోలీసులకు కూడా సవాల్‌గా మారిన సాంబ దొరికినట్లే దొరికి పారిపోవడమనేది పోలీసుల నిర్ణక్ష్యం కాక మరొకటి కాదు.
మరింత సమాచారం తెలుసుకోండి: