గ్రామీణ ప్రాంతాలలో ఒక్కొక్క గ్రామంలో నేటికీ వడ్డీ వ్యపారుల రూపంలో ఎటిఎంలు నిచేస్తున్నాయని, ఊరికి నలుగురు చొప్పున ఉన్న ఆ ఎటిఎంలను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో బ్యాంకులు ఆలోచించాలని ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి డి.శ్రీనివాసులు సూచించారు. అయితే వడ్డీ వ్యాపారుల వ్యవస్థ పూర్తిగా వెలివేయాలనుకోవడం సమంజసం కాదని, సామన్యుల బ్యాంకు ఖాతా తెరవడానికి ముందుకొస్తే అందుకు కావాల్సిన పద్దతులు అనుసరిస్తున్న నిబంధనలు వల్ల బ్యాంకుల నుండి దూరం అవుతున్నారని, ప్రత్యామ్నాయ అవసరాలను తీర్చుకోవటానికి గ్రామాలలో ఉన్నా ఎటిఎంలును ఆశ్రయిస్తున్నారని గుర్తు చేశారు.. వార్షికోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. నాబార్డు రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షకోత్సవ కార్యక్రమంలో శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి నాబార్డు ప్రాంతీయ చీఫ్ జనరల్ మేనేజర్ పి.మోహనయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశ జనాభాలో నేటికీ కేవలం 46 శాతం మంది మాత్రమే బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోగా, ఇంకా 54 శాతం మంది బ్యాంకులకు దూరంగా ఉన్నారని, అందుకు కారణాలేమిటనే దానిపై బ్యాంకులు దృష్టిసారించాలని, ఇంతవరకు చేరని వర్గాలను ఎలా చేర్చుకోవాలన్నది ప్రాధాన్యతగా తీసుకోవాలని అన్నారు. జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న పేదలు, సామాన్యులకు రుణ సౌకర్యం ఇవ్వటానికి ఏబ్యాంకు సముఖంగా లేదని, చివరికి తన పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే నేను జీవించి ఉన్నట్లు ధృవపత్రాన్ని బ్యాంకు అధాకారులు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. నిబంధనల పేరుతో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరువల్ల సామాన్యులు బ్యాంకులకు దూరంగా ఉంటున్నారని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరముందని ముఖ్యకార్యదర్శి చెప్పారు. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ఎగ్గిక్యూటీవ్ డైరెక్టర్ జి.గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రజల అవసరాలను ఏ మేరకు తీర్చగలుగుతున్నామన్న దానిపై ఆత్మపరీశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వ్యవసాయ రుణాలలను ఉత్పాదకతను పెంచడానికి బదులుగా వినియోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రుణ పరపతిని పెంచి తిరిగి వాటి వసూళ్లు, సహకార, గ్రామీణ బ్యాంకుల పరిపుష్ఠి వంటి అంశాలపై వాణజ్య బ్యాంకులకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని నాబార్డు అందజేస్తున్నదని, గ్రామీణ రుణ పరపతి పెంచడానికి వ్యవసాయం, స్వయం సహాయక గ్రూపులు, సహకార, గ్రామీణబ్యాంకులు పెరుగుదల పరిపుష్ఠితో పాటు వర్షభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలలపై మరిన్ని చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఎస్బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ వడ్డె శోభానాద్రీశ్వరరావు కూడా ప్రసంగించారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ మహనయ్య మాట్టాడుతూ రానున్న రోజుల్లో వ్యవసాయ సుస్థిరత, ఉత్పత్తి వ్యయం, ఉత్పత్తిదారుడు వినియోగదారునికి మధ్య ధర వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక సంచికలను అతిధులు ఆవిష్కరించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: