డిఎస్సి...మళ్లీ చదువులపై పడింది ‘పిడి‘

ఏ సమయానికి ఏం చేయాలో తెలియని ప్రభుత్వ పాలనలో మరోసారి విధ్యార్థులు పాఠాలు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలల్లో పంతుళ్ల భర్తీకోసం నిర్వహించనున్న డిఎస్సీ ఎంట్రన్స్ పిల్లల చదువులపై మళ్లీ పిడిగుద్దు గుద్దింది. పిల్లల పాఠాలకు ఆటంకం కలుగకుండా నిజానికి ఇవి ఎప్పుడైనా సరే మే నెలలో నిర్వహించి,ఇంటర్వ్యూలు,కౌన్సిలింగ్ జూన్ మొదటివారం పూర్తిచేసి కొత్త ఉపాద్యాయులను కూడా విధ్యార్థులకు అందుబాటులోకి తేవాలి. కాని విధాననిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం నష్టాన్ని కలిగిస్తోంది అనడానికి డిఎస్సి నిర్వహణ తేదీలే నిలువుటద్దం పడుతున్నాయి. గత విద్యాసంవత్సరం మద్యలో మొదట డిఎస్సీని ప్రక్రియను ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఉపాద్యాయశిక్షణలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇది మిస్సయితే ఇక ప్రభుత్వ ఉద్యోగానికి ఇప్పట్లో అవకాశం రాదని, ఒకవేల వచ్చినా అప్పటివరకు ప్రభుత్వఉద్యోగాలకు అర్హత వయసు దాటేవారు కూడా అధికసంఖ్యలో ఉండటంతో చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల్లోని టీచర్ల ఉద్యోగాలకు ప్రిపరేషన్ పేరుతో దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. రాష్ట్రంలో చదువుకుంటున్న విధ్యార్థుల్లో దాదాపు 75శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుకుంటున్న పిల్లలు పాఠాలకు దూరమయ్యారు. రకరకాల కారణాలను చూపుతూ అదిగో ఇదిగో అంటూ డిఎస్సి ని ప్రభుత్వం వాయిదావేస్తూ వచ్చింది. గతంలో డీఎస్సి నిర్వహణలో పలుసార్లు సంవత్సరాల కొద్ది సమయం తీసుకున్న సంధర్బాలు ఉండడంతో ఉసూరుమన్న అభ్యర్థులు తిరిగి వచ్చి పాత స్కూల్లలో యాజమాన్యాలను బతిమిలాడి ఉద్యోగాల్లో చేరారు. హాయిగా పాఠాలు మొదలుపెట్టి నెలరోజులు కూడా కాక ముందే ప్రభుత్వం డిఎస్సీ తేదీలను ప్రకటించింది. ఆగస్టు 26,27,28తేదీల్లో నిర్వహిస్తామని, ఈసారి వాయిదా వేసేది లేదని స్పష్టంచేశారు. దీంతో ప్రభుత్వఉద్యోగం కోసం మళ్లీ బడులలో చేరిన వారంతా సెలవులు కోరడం మొదలుపెట్టారు. ఇస్తే చదువులకు ఆటంకం,ఇవ్వకపోతే ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చిన అవకాశం దూరం చేస్తున్నామన్న బాధ...దీంతో ప్రైవేటు విధ్యాసంస్థల యాజమాన్యాలు సైతం ఇలాంటి పరిస్థితి కల్పించిన ప్రభుత్వం పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇవ్వకపోతే ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చిన అవకాశం కావడంతో ప్రైవేటు టీచర్ నౌకరీని వదిలేందుకు కూడా సిద్దమవుతున్నారు. దీంతో మళ్లీ విధ్యార్థులకు,ప్రైవేటు పాఠశాలల వారికి పాట్లు తప్పేలా లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: