గంగిరెడ్డి ఆస్తుల కేసులో జగన్ దొరికిపోతాడా....?

Chakravarthi Kalyan
ఇప్పటికే జగన్ పై అనేక ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. వాటి కోసం ఆయన ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు ముందు హాజరవుతున్నారు. వాటి విచారణకు ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియకుండా తయారైంది పరిస్థితి. ఇలాంటి సమయంలో జగన్ కు ఇంకా తలనొప్పులు పెరగునన్నాయా.. ఆయన కోర్టు కష్టాలు రెట్టింపు కానున్నాయా అన్న సందేహాలు వస్తున్నాయి. 

ఎందుకంటే.. ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి దొరికపోవడం జగన్ కు గుదిబండగా తయారవనుందని కొందరు చెబుతున్నారు. కొల్లం గంగిరెడ్డి దొరికిపోవడంతో అతని ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ కన్నేసింది. స్మగ్లింగ్ ద్వారా గంగిరెడ్డి దాదాపు 400 కోట్ల వరకూ సంపాదించాడని సాక్షాత్తూ డీజీపీయే మీడియా ముందు చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఆ రేంజ్ లో ఆదాయం ఉన్నప్పుడు సహజంగానే ఇన్ కంటాక్స్ వాళ్లు తమ పని తాము ప్రారంభిస్తారు కదా. 

ఈ సమయంలోనే ఆదాయపు పన్ను శాఖ, ఈడీ, పోలీసుల విచారణ ముమ్మరం అవుతుంది. కొల్లం గంగిరెడ్డికి జగన్ కు ఆర్థిక సంబంధాలున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకు గతంలో జగన్, గంగిరెడ్డి పలుసార్లు కలిసిన విషయాలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అదే నిజమైతే ఇప్పుడు కొల్లం గంగిరెడ్డి అక్రమాస్తుల విచారణ జగన్ మెడకు చుట్టుకు ప్రమాదం లేకపోలేదు. 

గంగిరెడ్డి అక్రమాస్తులు కొన్ని నేరుగా అతని పేరుమీదనే ఉన్నాయట. మరికొన్ని మరికొన్ని కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయట. ఇంకొన్ని బంధువులు పేరున బినామీ తరహాలో ఉన్నాయట. విచారణలో ఎక్కడైనా జగన్- గంగిరెడ్డి ల లింకు విషయంపై ఆధారాలు లభిస్తే.. అటు గంగిరెడ్డితో పాటు, ఇటు జగన్ కు కూడా కష్టాలు పెరుగుతాయి. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని లాభం పొందాలని టీడీపీ నేతలు చూడటం అత్యంత సహజమైన విషయం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: