స్పీకర్ నిర్ణయంపై సీఎం ఆగ్రహం

Priyanka Reddy
 అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలోని 12వ  క్లాజ్ పై టీడీపీ ఇచ్చిన సవరణ ప్రతిపాదన స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వివాదానికి కారణమైంది. సవరణ ప్రతిపాదనకు స్పీకర్ ఓటింగ్కు అనుమతించడాన్ని సీఎం తప్పుపట్టారు. వర్గీకరణ అంశాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసిందని ... అటువంటప్పుడు ఈ అంశాన్ని ఓటింగ్కు ఎలా అనుమతిస్తారని సీఎం కిరణ్ స్పీకర్ ను ప్రశ్నించారు. అయితే వర్గీకరణకు అనుకూలంగా గతంలో శాసనసభ తీర్మానం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే అశోకగజపతిరాజు గుర్తుచేశారు. దీనిపై అవసరమైతే అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరాలని సూచించారు. అయితే స్పీకర్ ఓటింగ్ కు అనుమతివ్వడాన్ని పీసీసీ చీఫ్, మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించారు. స్పీకర్ విజ్ఞత మేరకే మనోహర్ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానిచారు. అంతకుముందు సభలో ఎస్సీఎస్టీ ఉప ప్రణాళిక అంశంపై సభలో మాట్లాడేందుకు బొత్సకు అవకాశం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఒకానొక సమయంలో సభనుంచి వెళ్లిపోయి తన చాంబర్ లో కూర్చుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు వెళ్లి బొత్సను బుజ్జగించి తీసుకొచ్చారు. అయినా సభలో మాత్రం ముభావంగానే కనిపించారు. మొత్తానికి సభలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్ లో నేతల మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: