అమరావతి : జయదేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారా ?

Vijayaరాబోయే ఎన్నికల్లో పోటీచేయకూడదని గల్లా జయదేశ్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం టీడీపీ తరపున గుంటూరు లోక్ సభకు జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 19 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. మామూలుగా అయితే ఎవరైనా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ జయదేవ్ మాత్రం హ్యాట్రిక్ సాధించటం దేవుడెరుగు అసలు పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. గల్లా నిర్ణయం వల్ల తెలుగుదేశంపార్టీకి పెద్ద దెబ్బనే చెప్పాలి.ఇప్పటికిప్పుడు పార్టీ తరపున పార్లమెంటుకు పోటీచేసేంత గట్టినేతను వెతికిపట్టుకోవాలంటే చంద్రబాబునాయుడుకు కష్టమనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయటంలేదని గల్లా చెప్పగానే చంద్రబాబు షాక్ కు గురయ్యారు. వచ్చేఎన్నికలు పార్టీకి ఎంతో కీలకమైన నేపధ్యంలో పోటీచేయాల్సిందే అని చంద్రబాబు గట్టిగా ఒత్తిడిపెట్టారట. అయితే చంద్రబాబు ఎంత ఒత్తిడిపెట్టినా జయదేవ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని చెప్పారట. అందుకనే చాలాకాలంగా పార్టీలో జయదేవ్ యాక్టివ్ గా కూడా లేరు.చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబుతో జయదేవ్ కూడా ఉన్నారు. ఇపుడు కూడా పోటీచేసే విషయాన్ని మరోమారు ఆలోచించుకోమని చంద్రబాబు అడిగినా జయదేవ్ కాదన్నట్లు సమాచారం. ఇక్కడ విషయం ఏమిటంటే జయదేవ్ లో అసంతృప్తి బాగా పెరిగిపోతోందట. ఎందుకంటే ఎంపీగా తాను కేవలం ఉత్సవవిగ్రహలంగా అయిపోయినట్లు ఫీలవుతున్నారట.పార్లమెంటులో ఏ విషయంలో కూడా కేంద్రప్రభుత్వాన్ని నిలదీసేందుకు లేదని చంద్రబాబు చెప్పారట. ఏ విషయంలోను కేంద్రాన్ని గట్టిగా అడిగేందుకు లేనపుడు ఇక ఎంపీగా ఉండి ఉపయోగం ఏమిటనేది గల్లా ప్రశ్న. ఇదే సమయంలో తమ కంపెనీని బాగా విస్తరిస్తున్నారు. తెలంగాణా, హర్యానాలో ఉత్పత్తి యూనిట్లు రెడీచేస్తున్నారు. వీటి నిర్మాణం, ప్రొడక్షన్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకోవాల్సిన కారణంగా 2024లో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని, జయదేవ్ తో పాటు సత్తెనపల్లి నేత కోడెల శివరామ్ తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన ఇద్దరి విషయాన్ని పక్కనపెట్టేస్తే జయదేవ్ మాత్రం ఐదేళ్ళు గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నది వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: