అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని రెచ్చగొట్టి రష్యాపై యుద్ధం చేసేలా ఉసి గొల్పింది అమెరికా.  అయితే దీని వెనక కారణం అమెరికాలో ఉన్న ఆయుధ సంపత్తిని ఎలాగైనా అమ్మేయాలి,  వాటిని వదిలించుకోవడం ఒక పనయితే దాని ద్వారా డబ్బులు తీసుకొని బలపడటం మరో కారణం. 450 రోజులు గా యుద్దం కొనసాగుతూనే ఉంది. 31 దేశాల యుద్ధ సామగ్రి అందిస్తున్న కూడా రష్యా పై ఉక్రెయిన్ ఆధిపత్యం చెలాయించ లేకపోతుంది.  

అమెరికా కూడా యుద్ధ సామగ్రిని విరివిగా అందిస్తుంది. తాజాగా ఇంకో వివాదం చెలరేగే అవకాశం ఉంది. సెర్బియా, కోసావో మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది. కోవావోకు అమెరికా, యూరప్ దేశాలు అండగా ఉన్నాయి. సెర్బియా నుంచి కోసావో విడిపోయింది. ఇక్కడ సెర్బియాకు రష్యా అండగా ఉంటోంది. అదే సందర్భంలో సెర్బియా కోసావోను గుర్తించడం  లేదు. సెర్బియాలో కోసావో అంతర్భాగంగానే ఉందని చెబుతోంది.

అయితే రష్యా, చైనా సెర్బియా వైపు నిలబడటం, కోసావో కు అమెరికా, యూరప్ దేశాలు అండగా నిలవడం వల్ల మళ్లీ మరో రెండు దేశాలు యుద్ధం వైపు అడుగులు వేస్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోసావో ప్రధాని మాది స్వతంత్ర దేశం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని వాదిస్తుంటే సెర్బియా మాత్రం కోసావో అనేది ఇక్కడ అంతర్భాగమని చెబుతోంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. రష్యా నుంచి ఆయిల్ ఎగుమతి లేక యూరప్ దేశాలు తల్లడిల్లుతున్నాయి.

జర్మనీ , బ్రిటన్ లాంటి దేశాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడుతోంది. ఉద్యోగులు పోయి, ఉపాధి లేక యువత అవస్థలు పడుతున్నారు. సెర్బియా, కోసావో మధ్య ఏం జరగబోతుంది. ఏయే దేశాలు ఎటు వైపు మద్దతు నిలుస్తాయి. శాంతియుతంగానే సమస్యను పరిష్కరిస్తాయా? లేక మళ్లీ యుద్ధం వైపు అడుగులు వేస్తాయా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: