ఉత్తరాంధ్ర : టిడ్కో ఇళ్ళపై అవే అబద్ధాలా ?

Vijaya


టిడ్కో ఇళ్ళ నిర్మాణంపై చంద్రబాబునాయుడు చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. తమ హయాంలో పూర్తయిన 3.15 టిడ్కో ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి లబ్దిదారులకు ఎందుకు ఇవ్వలేదంటు మండిపడ్డారు. పెందుర్తి నియోజకవర్గంలో నేతలతో సమావేశమైనపుడు టిడ్కో ఇళ్ళ ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో మాట్లాడుతు పేదలకు స్ధిరమైన ఆస్తిని అందివ్వాలన్న ఉద్దేశ్యంతో లక్షల ఇళ్ళ నిర్మాణాలను చేసినట్లు చెప్పారు. తాము పూర్తిచేసిన ఇళ్ళను జగన్ లబ్దిదారులకు అందివ్వకుండా నాశనం చేసేసినట్లు మండిపడ్డారు.



ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే టిడ్కో ఇళ్ళ విషయంలో చంద్రబాబు చెప్పింది కొంతవరకే కరెక్టు. మిగిలిదంతా అబద్ధాలే. టిడ్కో ఇళ్ళ నిర్మాణాలను ప్రారంభించటం వరకు కరెక్టే. అయితే పూర్తయిన వాటిని జగన్ లబ్దిదారులకు ఇవ్వలేదన్నది మాత్రం అబద్ధం. ఇళ్ళ నిర్మాణం సగంలో ఉండగానే ఎన్నికలు రావటంతో అవన్నీ పూర్తియిపోయినట్లు, లబ్దిదారులకు ఇచ్చేసినట్లుగా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. దాన్నుండి లబ్దిపొందాలని ప్లాన్ చేశారు. అయితే చంద్రబాబు ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది.



విషయం ఏమిటంటే నాలుగు గోడలు, కప్పు, ఫ్లోరింగ్ వరకే పూర్తయ్యింది. కరెంటు వైరింగ్, బాత్ రూమ్ ఫిట్టింగులు, ప్లంబింగ్ వర్కు, డ్రైనేజి సిస్టమ్ ఏమీ చేయలేదు. ఇవేవీ లేకుండా ఇళ్ళు పూర్తియిపోయాయంటే అయినట్లేనా ? అందుకనే  లబ్దిదారులు ఎవరు ఇళ్ళల్లో దిగలేదు. తర్వత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ పూర్తిచేస్తారనుకుంటే చేయలేదు. ఇక్కడే జగన్ పెద్ద తప్పుచేశారు. బ్యాలెన్స్ వర్కయిన కనీస సౌకర్యాలను పూర్తిచేసి లబ్దిదారులకు ఇచ్చేసుంటే బాగుండేది.



అలాచేయకుండా తాను కొత్తగా టిడ్కో ఇళ్ళని, జగనన్న కాలనీలని మొదలుపెట్టారు. దాంతో పనులన్నీ ఆలస్యమవుతున్నాయి. నిజంగానే తన హయాంలోనే ఇళ్ళని నూరుశాతం చంద్రబాబే పూర్తిచేసుంటే తానే లబ్దిదారులకు వాటిని ఎందుకు ఇవ్వలేదు ? తాను పూర్తిచేసి లబ్దిదారులకు ఇవ్వకుండా తర్వాత వచ్చిన జగన్ పైన మండిపడితే ఉపయోగమేమిటి ? మళ్ళీ ఇపుడు టిడ్కో ఇళ్ళని లబ్దిదారులకు ఉచితంగా ఇస్తానని తప్పుడు హామీలలిస్తున్నారు. పైగా జగన్ ఇస్తున్న ఇళ్ళు జనాలుండటానికి పనికిరావట. తాను నిర్మించిన ఇళ్ళేమో 350 చదరపు అడుగులు. ఇపుడు జగన్ నిర్మిస్తున్న ఇళ్ళు 435 చదరపు అడుగులు. ఈ తేడాలోనే తెలీటంలేదా ఎవరు పెద్దది కట్టింది ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: