చనిపోయిన వ్యక్తినీ.. ఓటేసి గెలిపించారు.. ఎక్కడుంటే?

praveen
ఎన్నికల జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైతే తమకు మంచి పాలన అందిస్తారు అని ప్రజలు భావిస్తారో ఇక వారికే ఓటు వేసి పట్టం కట్టడం కూడా చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో ఓటు వేసే విషయంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం పెరిగిపోయిన నేపథ్యంలో ఒకప్పటిలా డబ్బు మధ్యానికి  లొంగి పోకుండా నేటి రోజుల్లో ఓటర్లు అందరూ కూడా నచ్చిన నాయకులను ఎన్నుకోవడం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎన్నికల్లో మాత్రం విచిత్రమైన ఘటన జరిగింది.

 సాదరణంగా ఇప్పటివరకు తమకు అన్ని పనులు చేసి పెడతాడు మంచి పాలన అందిస్తాడు అన్న నాయకులను ఓట్లు వేసి ఎన్నుకోవడం చూసాము. కానీ ఇక్కడ ఎన్నికలలో మాత్రం ఏకంగా చనిపోయిన వ్యక్తికే ఓటు వేసి ఇక ఎన్నుకున్నారు జనాలు. ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఉత్తర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలలో విచిత్రమైన ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికలలో నమోదైన ఒక విజయం మాత్రం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఎన్నికలు జరగడానికి ముందే ఇక ఆ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థి అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయం ఇక మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఆమెకే ఓటు వేసి చివరికి గెలిపించారు.

 హసన్ పూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు నుంచి ఆషియా బి అనే మహిళ పోటీ చేశారు. అయితే ఇటీవల వచ్చిన ఫలితాలలో ఆమె గెలుపొందారు. అయితే ఓటింగ్కు ముందే ఆషియా బి అనారోగ్యంతో మృతి చెందారు. ఏప్రిల్ 16వ తేదీన నామినేషన్ వేసిన ఆమె.. 20వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు.  అయినప్పటికీ ఆషియా బి ప్రచారంలో ఇక ఇచ్చిన వాగ్దానాలు.. ఆమె ఓటర్లతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగిన తీరు.. ఇక ఆమెకు పట్టం కట్టేలా చేశాయని ఆ మున్సిపాలిటీ ప్రజలు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా చనిపోయిన వ్యక్తిని గెలిపించడం గురించి తెలిసిఅందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: