అమరావతి : లైఫ్ లో ఫస్ట్ టైం. ఏం చేస్తాం అంతా ఖర్మ ...

Vijaya



దెబ్బకు దెయ్యం దిగివచ్చిందని పెద్దలు అంటుంటారు. ఇపుడు మార్గదర్శి ఛైర్మన్, చీటింగ్ కేసులో  ఏ1 నిందితుడు రామోజీరావుకు కూడా ఈ విషయం అనుభవంలోకి వచ్చినట్లుంది. అందుకే అంతా ఖర్మ అని అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసాల్లో రామోజీని సీఐడీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణ కోసం ఇంటికి వెళ్ళినపుడు తప్పించుకునేందుకు అనారోగ్యం పేరుతో ప్రయత్నించినా సాధ్యంకాలేదు.



దాంతో మంచంమీద పడుకునే విచారణలో సమాధానాలు  చెప్పారు. ఈ సందర్భంగానే సీఐడీ ఉన్నతాధికారులతోనో లేకపోతే తన వ్యక్తిగత సహాయకులతోనో రామోజీ మాట్లాడిన  వీడియో క్లిప్పింగ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఏముందంటే ఫస్ట్ టైం లైఫ్ లో తనకీ పరిస్ధితి వచ్చిందన్నారు. ఇప్పటివరకు తనింటికి సీఐడీ కానీ మరెవరు కానీ విచారణకు రాలేదట.  ఈ పరిస్ధితిని  కాలమహిమ అనుకోవాలా ? లేకపోతే జగన్ మహిమ అనుకోవాలా ? అని ప్రశ్నించారు. కానీండి ఏం చేస్తాం..అని నిర్వేధంతో మాట్లాడారు.



సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే రామోజీకి అసలు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చింది ? తాను అద్దాలగదిలో కూర్చుని ఎదుటివాళ్ళపై రాళ్ళు వేయకూడదన్న కనీస ఇంగితం రామోజీలో లోపించటం వల్లే కదా. సీఐడీ ప్రకారం మార్గదర్శి ముసుగులో తాను వేల కోట్లరూపాయల మోసాలు చేస్తు, మనీల్యాండరింగ్, హవాలకు పాల్పడుతు జగన్మోహన్ రెడ్డిని వెంటాడకూడదన్న కనీస బుద్ధికూడా రామోజీలో లేకపోవటమే విచిత్రంగా ఉంది.



తనలో అనేక బొక్కలు పెట్టుకుని జగన్లో బొక్కలున్నాయని  ప్రతిరోజు బురదచల్లేస్తుంటే జగన్ ఎందుకు చూస్తూ ఊరుకుంటారు ? అప్పటికీ రామోజీకి జగన్ మర్యాదిచ్చారు. అయితే ఆ మర్యాదను రామోజీ నిలుపుకోలేదు. చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమని జగన్ మీద బురదచల్లేస్తున్నారు. కొంతకాలం ఓపికపట్టి ఇక లాభంలేదని అనుకున్నారు. అందుకనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులో ప్రభుత్వం తరపున ఇంప్టీడయ్యారు. దాంతోనే కేసులు, విచారణ దెబ్బకు గూబగుయ్యిమనటంతో రామోజీ మంచమెక్కి వైరాగ్యం మాట్లాతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: