అమరావతి : చంద్రబాబు ముందు రజనీకాంత్ పనికొస్తారా ?

Vijaya
ఏ ముహూర్తాన వెన్నుపోటుకు గురైన ఎన్టీయార్ అల్లుడు చంద్రబాబునాయుడు గురించి చెప్పారో తెలీదు. తనకుమించిన నటుడు తనల్లుడు చంద్రబాబు అంటు పదేపదే చెప్పారు. అనేక సందర్భాల్లో అది నిజమే అని నిరూపితమైనా తాజాగా మళ్ళీ ప్రూవ్ అయ్యింది. కృష్ణాజిల్లాలోని పోరంకిలో ఎన్టీయార్ శతజయంతి వేడుకలు జరిగాయి. అందులో ముఖ్యఅతిధిగా సినీనటుడు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు ఎన్టీయార్ శాశ్వతంగా అందరికీ గుర్తుండిపోయేలా ఆయన పేరుమీద స్మారకచిహ్నాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.తెలుగుజాతికి గర్వకారణం అనిపించేలా స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ గా ఆ శాశ్వాత చిహ్నాన్ని తీర్చిదిద్దుతామన్నారు. సరే అరిగిపోయిన రికార్డు ఎన్టీయార్ కు భారతరత్న అనే డిమాండ్ ఎప్పటికీ వినిపిస్తునే ఉంటారు. ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం వచ్చేదిలేదు చంద్రబాబు డిమాండ్ ఆపేదిలేదు. ఎందుకంటే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం రావటం చంద్రబాబుకే ఇష్టంలేదని స్వయంగా లక్షీపార్వతే చెప్పారు. ఏదో కంటితుడుపు కోసమే ఎన్టీయార్ కు భారతరత్న డిమాండ్ వినిపిస్తుంటారని ఆమె మండిపోయారు.అధికారంలో ఉన్నపుడు ఎప్పుడు కూడా ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండును చంద్రబాబు వినిపించిందిలేదు. కేంద్రంలో చక్రంతిప్పానని చెప్పుకున్న రోజుల్లో ఈ విషయమే గుర్తుకురాలేదు. ఇక శాశ్వాతచిహ్నం విషయం చూస్తే 2014లో అధికారంలోకి వచ్చినపుడు కూడా ఈ విషయాన్ని చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. కేంద్రం ఈమధ్యనే ఎన్టీయార్ బొమ్మతో విడుదలచేసిన 100 రూపాయల కాయిన్ లో కూడా చంద్రబాబు పాత్రలేదు. కృష్ణాజిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టాలని ఎప్పటినుండో ఉన్న డిమాండును కూడా చంద్రబాబు పట్టించుకోలేదు.చివరకు విజయవాడ హెడ్ క్వార్టర్స్ గా ఏర్పడిన జిల్లాకు ఎన్టీయార్ పేరుపెట్టింది జగన్మోహన్ రెడ్డి. జిల్లాకు ఎన్టీయార్ పేరుపెట్టడాన్ని కూడా చంద్రబాబు స్వాగతించకలేకపోయారు. అధికారంలో ఉన్నపుడు ఎన్టీయార్ పేరుమీద శాశ్వాతచిహ్నాన్ని ఏర్పాటుచేస్తే, ఒక మ్యూజియం ఏర్పాటుచేస్తే ఎవరన్నా అడ్డుతగిలారా ? ఎన్టీయార్ పుట్టిపెరిగిన నిమ్మకూరు గ్రామంలో మ్యూజియం ఏర్పాటుచేయాలనే డిమాండును చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు ? ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారమైనా, శాశ్వతచిహ్నమైనా, మ్యూజియం ఏర్పాటయినా అన్నీ ప్రతిపక్షంలో ఉన్నపుడు,  ఎన్నికల సభలు, ప్రచారంలో గుర్తుకొస్తాయంతే. అందుకనే రజనీకాంత్ కూడా చంద్రబాబు ముందు పనికిరాడన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: